jioPhone ఇప్పుడు మార్కెట్ లో బహిరంగంగా , రిజిస్ట్రేషన్ లేకుండా అమ్మబడుతోంది.

Updated on 26-Oct-2017
HIGHLIGHTS

బహిరంగంగా అమ్మబడుతోంది.

 రిలయన్స్ జియో  యొక్క 4G VoLTE సపోర్ట్ గల ఫీచర్ ఫోన్ యొక్క ప్రీ బుకింగ్ దీపావళి తరువాత మళ్ళీ మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి .  ఇప్పుడు ఈ ఫోన్ బుకింగ్స్ కి ముందే  సేల్స్ కి  అందుబాటులో కలదు .కొంతకాలం క్రితం, OLX లో 700 నుంచి 1,700 రూపాయలకు విక్రయించబడింది. ఇప్పుడు ఈ ఫోన్లు రిటైల్ షాపులో బహిరంగంగా విక్రయించబడుతున్నాయి. 

bgr.in  యొక్క రిపోర్ట్స్ ప్రకారం ,  ఢిల్లీ యొక్క ఒక రిటైల్ షాప్ లోజియో  ఫోన్ రిజిస్ట్రేషన్ లేకుండా  1800 రూ.  ధరలో కొనవచ్చు .  ఈ ఫోన్ ధర అసలు రూ .1,500. అదే సమయంలో,  ఈ స్టోర్స్  నుండి ఒక జియోఫోన్ ని కొనడానికి  రిటైలర్ బిల్ ఇవ్వటానికి  నిరాకరించారు.ఈ ఫోన్ కొంటె మీకు బిల్ ఇవ్వబడదు . దీని తరువాత రిలయన్స్ నుంచి 3 ఏళ్ల  తరువాత ఫోన్  రిఫండ్ పై  ఎటువంటి గ్యారంటీ లేదు . 

రిటైలర్లు రిజిస్ట్రేషన్ లేకుండా  ఫోన్ ని  విక్రయించడం వల్ల ఫోన్ బాక్స్ పై  ధర రాయలేదు. అటువంటి సందర్భంలో, కొనుగోలు తర్వాత ఫోన్ బిల్లు చేయడం సాధ్యం కాదు, మరియు బిల్లు లేకుండా, సంస్థ ఈ ఫోన్ యొక్క రిఫండ్ ఇవ్వటం జరగదు .అందుకే ఈ ఫోన్ రిటైల్ స్టోర్స్ లో కొనటం కంటే olx  మరియు  కంపెనీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవటం మంచింది . 

 

 

Connect On :