జియోఫోన్ 2 తదుపరి ఫ్లాష్ సేల్ ఆగష్టు 30న రానుంది
జియోఫోన్ 2 మొదటి ఫ్లాష్ సేల్ మొదలుపెట్టిన కొన్ని నిముషాల వ్యవధిలోనే మొత్తం అమ్ముడైనట్లు జియో ప్రకటించింది మరియు దీని తదుపరి ఫ్లాష్ సేల్ ఆగష్టు 30న jio.com ద్వారా జరగనుందని తెలిపింది.
ఈ జియోఫోన్ 2 ఇటీవలే ఫ్లాష్ సేల్ కి అందుబాటులో ఉండగా కొన్ని నిముషాల వ్యవధిలోనే మొత్తం అమ్ముడైనట్లు జియో ప్రకటించింది. ఇప్పుడు, కంపెనీ ఈ డివైజ్ తదుపరి ఫ్లాష్ సేల్ ని సెకండ్ ఫ్లాష్ సేల్ గా ఆగష్టు 30న మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంచుతుంది. ఈ కొత్త ఫోన్ రూ . 2,999 తో పైన తెలిపిన విధంగా jio.com ద్వారా కొనడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ జియో యొక్క విజవంతమైన ఫోన్ అయిన జియోఫోన్ యొక్క స్పెక్స్ని చాలవరకు పోలివుంటుంది. ఫోర్-వే నావిగేషన్ తో కూడిన క్వర్టీ కీబోర్డ్ మరియు క్షితిజసమాంతర డిస్ప్లే ని ఫీచర్స్ గా కలిగివుంది.
జియోఫోన్ 2 ఫీచర్స్ మరియు స్పెక్స్
జియోఫోన్ 2 లో నాలుగు-మార్గాల నావిగేషన్ కీతో QWERTY కీబోర్డు ఉంటుంది మరియు క్షితిజసమాంతర వీడియో వీక్షణను అందించే 2.4-అంగుళాల QVGA డిస్ప్లే మరియు డ్యూయల్ – సిమ్ మద్దతును అందిస్తుంది. అయితే ఇందులో 4జి వోల్టి(voLTE) స్లాట్ లో జియో ని మాత్రమే వాడుకునే వీలుతో పాటు 2జి స్లాట్ తో రెండవ ఇతర ఆపరేటర్ సిమ్ ని వాడుకోవచ్చు.
ఈ ఫోన్ 512ఎంబీ ర్యామ్ మరియు 4జీబీ అంతర్గత స్టోరేజ్ తో వస్తుంది, ఇది మైక్రో SD కార్డుని ఉపయోగించి 128జీబీ వరకు మరింతగా విస్తరించే వీలుంది. . జియోఫోన్ మాదిరిగానే, జియోఫోన్ 2 కూడా KAI OS పై నడుస్తుంది మరియు ఇది 2,000 mAh శక్తిగల బ్యాటరీని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 1GHz డ్యూయల్-కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు 2ఎంపీ రియర్ కెమేరా వెనుక మరియు 0.3 ముందు కెమెరాని ఈ డివైజ్ కలిగివుంటుంది.
కనెక్టవిటీ విషయానికి వస్తే , వోల్టి(voLTE) కు మద్దతు ఇస్తుంది, అయితే, ఇది VoWiFi కు మద్దతు ఇస్తుంది మరియు మల్టీమీడియా బ్రాడ్కాస్ట్ మల్టికాస్ట్ సర్వీస్ (eMBMS) ను కూడా అభివృద్ధి చేస్తుంది. ఫోన్ NFC, Wi-Fi కనెక్టివిటీ, బ్లూటూత్ తక్కువ శక్తికి కూడా మద్దతు ఇస్తుంది మరియు దీనిలో FM రేడియో అంతర్నిర్మితంగా ఉంటుంది.
జియోఫోన్ రీఛార్జ్ ఎంపికలు (ఆప్షన్స్)
రిలయన్స్ జీయో జియోఫోన్ వినియోగదారుల కోసం మూడు ప్లాన్స్ ని అందిస్తుంది. ఇందులో రూ .48 ప్లాన్ తో వినియోగదారుడు అపరిమితమైన కాలింగ్, 1జీబీ హై-స్పీడ్ డేటా, 50 ఉచిత ఎస్ఎంఎస్, మరియు జియో యాప్లకు 28 రోజులపాటు యాక్సెస్ పొందవచ్చు. రూ .99 ప్లాన్ తో 14 జీబి డేటా, ఉచిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్, జీయో యాప్ యాక్సెస్ 28 రోజులు. చివరగా, జియో నుండి రూ. 153 ప్లాన్ తో ఉచిత కాలింగ్, 42 జిబి డేటా, జీయో యాప్స్ యాక్సిస్, మరియు అపరిమిత SMS, 28 రోజులు చెల్లుగబాటుగా వుంది.
కొత్త జియోఫోన్ 2 కొనుగోలు చేయకూడని వారు ఒరిజినల్ జియోఫోన్ ని కొనుగోలు చేయవచ్చు, ఇది మాన్సూన్ హంగామా ఆఫర్ క్రింద ఇప్పుడు అమ్మబడుతోంది. ఈ ఆఫర్ కింద, ఒక జియోఫోన్ కోసం తమ పాత ఫీచర్ ఫోనును మార్పిడి చేసి,ఇంకా అదనపు రుసుం కింద రూ . 501 రూపాయలు చెల్లించాలి, అయితే ఈ మొత్తం రూ . 501 ని మూడు సంవత్సరాల తర్వాత తిరిగి రిఫండ్ అవుతుంది. జీయో రూ . 594 ధరతో కూడిన ప్రత్యేక రీఛార్జి ప్లాన్తో కలపడంతో ఇది జాయింట్ ఆఫర్ గా, జియో ఫోన్ ని కొనుగోలు చేయవలసి ఉంటుంది వినియోగదారులు, మాన్సూన్ హంగామా ఆఫర్ కింద.