రిలయన్స్ జియో నుండి మార్కెట్ లోకి కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్ అయ్యింది. Jio Prima 4G పేరుతొ వచ్చిన కొత్త కొత్త ఫీచర్ ఫోన్ ట్రెండీ ఫీచర్స్ తో పాటు స్టైలిష్ డిజైన్ మరియు ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది. జియో ప్రైమా అవ్వడానికి ఫీచర్ ఫోన్ అయినా స్మార్ట్ ఫోన్ లాంటి ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే, జియో ఈ కొత్త ఫోన్ గురించి గొప్ప చెబుతోంది. మరి రిలయన్స్ జియో తీసుకు వచ్చిన ఈ కొత్త ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
జియో ప్రైమా ఫీచర్ ఫోన్ ను రిలయన్స్ జియో రూ. 2,599 ధరతో లంచ్ చేసింది. ఈ ఫోన్ ను Jio Mart నుండి సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది. వాస్తవానికి ఈ ఫీచర్ ఫోన్ మొదటిగా రీసెంట్ గా జరిగిన IMC 2023 (ఇండియా మొబైల్ కాంగ్రెస్) నుండి ప్రదర్శించింది మరియు ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులోకి తీసుకు వచ్చింది.
జియో ప్రైమా ఫీచర్ ఫోన్ 2.4 ఇంచ్ TFT డిస్ప్లేని కలిగి వుంది. ఈ జియో ఫీచర్ ఫోన్ లో వెనుక కెమేరా మరియు ఫ్లాష్ లైట్ ను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 1800mAh బ్యాటరీతో వస్తుంది మరియు బ్లూటూత్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ kaiOS పైన పని చేస్తుంది మరియు 512GB RAM తో వస్తుంది. ఈ ఫోన్ లో ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 128GB వరకూ విస్తరించ గల అవకాశం కూడా వుంది.
ఈ ఫోన్ Youtube, Whatsapp, jio Cinema, JioTv వంటి మరిన్ని యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి, చవక ధరలో ఉపయోగకరమైన చాలా ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉన్నట్లే చెప్పవచ్చు.
Also Read : Big Alert: New ట్రిక్ తో బ్యాంక్ అకౌంట్స్ కొల్లగొడుతున్న స్కామర్లు.!