JioBharat B1 Series నుండి చవక ధరలో మరొక New 4G Phone లాంచ్.!
చవక ధరలో 4G phone ను అందించే దిశగా Reliance Jio పరుగులు తీస్తోంది
JioBharat B1 Series నుండి Affordable Price లో మరొక కొత్త 4G ఫోన్ లాంచ్ చేసింది
ఈ కొత్త ఫోన్ ను జియో అధికారిక వెబ్సైట్ jio.com నుండి లిస్టింగ్ చేసింది
దేశంలో ప్రయతి ఒక్కరికీ చవక ధరలో 4G phone ను అందించే దిశగా Reliance Jio పరుగులు తీస్తోంది. ఇప్పటికే చవక ధరలో చాలా 4G స్మార్ట్ ఫోన్ లను అందించిన రిలయన్స్ జియో, ఇప్పుడు JioBharat B1 Series నుండి Affordable Price లో మరొక కొత్త 4G ఫోన్ లాంచ్ చేసింది. జియో తీసుకు వచ్చిన ఈ కొత్త ఫోన్ ను జియో అధికారిక వెబ్సైట్ jio.com నుండి లిస్టింగ్ చేసింది. ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
JioBharat B1 Series Specs
రిలయన్స్ జియో కొత్తగా తీసుకు వచ్చిన ఈ జియోభారత్ బి1 ఫీచర్ ఫోన్ 2.4 Inch Big screen తో వచ్చింది. ఈ ఫోన్ కేవలం బ్లాక్ కలర్ లో మాత్రమే అందుబాటులో వుంది మరియు ఈ ఫోన్ లో UPI Payment ఫీచర్ ను కూడా జియో అందించింది. ఈ జియోభారత్ బి1 ఫీచర్ ఫోన్ 23 భాషలలో మెసేజీలను చదవగలదు. అంతేకాదు, JioPay, JioSaavn మరియు JioCinema వంటి అన్ని జియో యాప్స్ Pre-install గా తీసుకు వస్తుంది.
జియోభారత్ బి1 ఫీచర్ ఫోన్ 2000 mAh బిగ్ బ్యాటరీతో వచ్న్డి కాబట్టి ఎక్కువ సమయం బ్యాటరీ బ్యాకప్ ను కూడా అందించ కలుగుతుందని జియో చెబుతోంది. ఈ ఫోన్ లో Crystal Clear Voice, Unlimited Music మరియు Phone Camera వంటి ఫీచర్స్ ను కూడా మీరు పొందవచ్చు.
Also Read : Redmi 32 ఇంచ్ Fire TV పైన బిగ్ డీల్ అందించిన Amazon GIF Sale.!
జియోభారత్ బి1 ధర
ఇక ఈ జియోభారత్ బి1 ఫీచర్ ఫోన్ ధర విషయానికి వస్తే, ఈ ఫీచర్ ఫోన్ ను రూ. 1,299 రూపాయల ధరలో జియో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ ను మీరు జియో వెబ్సైట్ మరియు జియో అవుట్ లెట్స్ లో పొందవచ్చు.
జియోభారత్ బి1 vs జియోభారత్ వి1
జియోభారత్ బి1 మరియు జియోభారత్ వి1 మధ్య ఉన్న వ్యత్సాసాల విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్లలో ఉన్న Display మరియు Battery లలో మేజర్ చేంజ్ వుంది. జియోభారత్ బి1 ఫోన్, జియోభారత్ వి1 కంటే పెద్దదైన డిస్ప్లేని కల్గి ఉంటుంది మరియు పెద్ద బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.
ఎంటర్టైన్మెంట్ ను కోరుకునే వారికి కూడా చేరవడానికి ఈ ఫోన్ ను జియో లాంచ్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా, రిలయన్స్ జియో కొత్త ఫోన్స్ మరియు బడ్జెట్ ప్లాన్స్స్ తో మరింత ముందుకు వెళుతున్నట్లు గమనించవచ్చు.