Jio Bharat V3 and V4: చవక ధరలో రెండు కొత్త 4G ఫీచర్ ఫోన్లు లాంచ్ చేసిన జియో.!

Jio Bharat V3 and V4: చవక ధరలో రెండు కొత్త 4G ఫీచర్ ఫోన్లు లాంచ్ చేసిన జియో.!
HIGHLIGHTS

జియో ఈరోజు భారత్ V సిరీస్ నుంచి రెండు కొత్త 4G ఫీచర్ ఫోన్ లను విడుదల చేసింది

దీపావళి 2024 కానుకగా ఈ రెండు కొత్త ఫోన్లు చవక ధరలో చవక ప్లాన్స్ తో వచ్చాయి

ఈ కొత్త ఫోన్ లు లైవ్ టీవీ మరియు UPI పేమెంట్ వంటి చాలా ప్రయోజనాలతో వస్తాయి

Jio Bharat V3 and V4: రిలయన్స్ జియో ఈరోజు భారత్ V సిరీస్ నుంచి రెండు కొత్త 4G ఫీచర్ ఫోన్ లను విడుదల చేసింది. దీపావళి 2024 కానుకగా ఈ రెండు కొత్త ఫోన్లు చవక ధరలో మరియు చవక ప్లాన్స్ తో వచ్చాయి. ఈ కొత్త ఫోన్ లు లైవ్ టీవీ మరియు UPI పేమెంట్ వంటి చాలా ప్రయోజనాలతో వస్తాయి. జియో సరికొత్తగా విడుదల చేసిన ఈ రెండు కొత్త ఫోన్ల ధరలు మరియు ఫీచర్లు తెలుసుకోండి.

Jio Bharat V3 and V4: ధర

రిలయన్స్ జియో ఈ రెండు ఫోన్ లను రూ. 1,099 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ లను కూడా జియో యొక్క అతి చవక జియో ఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ Rs 123 తో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా త్వరలోనే అన్ని మొబైల్ షాప్ లు, JioMart మరియు అమెజాన్ నుంచి లభిస్తాయి.

Jio Bharat V3 and V4: ఫీచర్స్

రిలయన్స్ జియో ఈ ఫోన్ లను కేవలం వెయ్యి రూపాయల చవక ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది. ఈ రెండు ఫోన్ లలో భారత్ వి3 ఫోన్ ను స్టైల్ సెంట్రిక్ ఫోన్ గా వి4 ను డిజైన్ ప్రాధాన్యత కలిగిన ఫోన్ గా విడుదల చేసింది. వి3 ఫోన్ నేటి యువతరానికి తగిన స్టైల్ తో వస్తే, వి4 మాత్రం కటింగ్ ఎడ్జ్ డిజిటల్ సర్వీస్ లతో వస్తుంది.

Jio Bharat V3 and V4 Launched

ఈ రెండు ఫోన్లు కూడా జియో ఎక్స్ క్లూజివ్ సర్వీస్ సూట్ తో వస్తాయి. అంటే, ఈ రెండు ఫోన్లు కూడా 455 live TV ఛానల్ ను JioTv ద్వారా చూసే అవకాశం కలిగి ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ కలిగి వున్న JioCinema సపోర్ట్ తో సినిమాలు మరియు సిరీస్ లు కూడా ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు, JioPay ద్వారా UPI సర్వీసులు కూడా ఉపయోగించు కోవచ్చు. ఈ ఫోన్ మెమోరిని ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ ద్వారా 128GB వ్ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 23 భారతీయ భాషలకు సపోర్ట్ కూడా చేస్తుంది.

Also Read: Realme P1 Speed 5G: 26GB ర్యామ్ మరియు ఆకట్టుకునే డిజైన్ ఓ లాంచ్ అయ్యింది.!

ఇక ఈ ఫోన్ తో జత సుహాసిని రూ. 123 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అందించే [ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ 28 చెల్లుబాటు అవుతుంది. ఈ 28 రోజుల పాటు రోజుకు 0.5GB హాయ్ స్పీడ్ డేట్, 300 SMS ల వినియోగం మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలు పొందుతారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo