itel ZENO 10: కేవలం రూ. 5999 ధరకే పెద్ద స్క్రీన్ మరియు 12GB RAM ఫీచర్ తో లాంచ్.!

Updated on 10-Jan-2025
HIGHLIGHTS

ఐటెల్ ఈరోజు కొత్త బడ్జెట్ స్మార్ ఫోన్ ను విడుదల చేసింది

itel ZENO 10 స్మార్ట్ ఫోన్ ను 6 వేల కంటే తక్కువ ధరలో విడుదల చేసింది

పెద్ద స్క్రీన్ మరియు 12GB RAM ఫీచర్ తో లాంచ్ చేసింది

itel ZENO 10: ఐటెల్ ఈరోజు కొత్త బడ్జెట్ స్మార్ ఫోన్ ను విడుదల చేసింది. అదే జెనో 10 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను  6 వేల కంటే తక్కువ ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ ను చాలా చవక ధరలో పెద్ద స్క్రీన్ మరియు 8GB RAM ఫీచర్ తో లాంచ్ చేసింది.

itel ZENO 10: ప్రైస్

ఐటెల్ జెనో 10 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (3GB + 64GB) ను రూ. 5,999 ధరతో, (4GB + 64GB) వేరియంట్ ను రూ. 5,499 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ అపి అల్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఫోన్ 3GB వేరియంట్ పై రూ. 300 మరియు 4GB (8GB వర్చువల్ ర్యామ్) వేరియంట్ పై రూ. 500 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి అమెజాన్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది.

Also Read: Xiaomi mega Clearance sale నుంచి 43 ఇంచ్ టీవీ రేటుకే 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఆఫర్ చేస్తోంది.!

itel ZENO 10: ఫీచర్స్

ఐటెల్ జెనో 10 స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ బిగ్ HD+ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ Dynamic Bar ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆక్టాకోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3GB వేరియంట్ 5GB మెమొరీ ఫ్యూజన్ మరియు 4GB ర్యామ్ వేరియంట్ 8GB మెమరీ ఫ్యూజన్ ర్యామ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంటే, ఈ ఫోన్ గరిష్టంగా 12GB ర్యామ్ ఫీచర్ తో వస్తుంది.

ఈ ఫోన్ లో వెనుక 8MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ‎Android 14.0 Go OS పై నడుస్తుంది. ఈ ఐటెల్ కొత్త ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 10W ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తో పాటు ఆకర్షణీయమైన బ్యాక్ కవర్ ను ఉచితంగా కూడా అందిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :