Upcoming: ప్రముఖ మొబైల్ కంపెనీ itel ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేయబోతోంది. ఐటెల్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను Zeno 10 పేరుతో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను 2025 జనవరి నెలలో లాంచ్ చేస్తుందని అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ మొదలుపెట్టింది. ఈ అప్ కమింగ్ ఫోన్ ను చవక ధరలో గొప్ప ఫీచర్స్ తో లాంచ్ చేయనున్నట్లు ఐటెల్ గొప్పగా చెబుతోంది.
ఐటెల్ జెనో 10 స్మార్ట్ ఫోన్ ను 2025 జనవరి నెలలో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ఇండియా నుంచి సేల్ అవుతుంది. అమెజాన్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజితో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను రూ. 5,XXX ధరతో టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ ను 6 వేల కంటే చవక ధరలో లంచ్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చింది.
ఐటెల్ జెనో 10 స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ తో అందిస్తోంది. ఈ ఫోన్ వెనుక సరికొత్త మల్టీ కలర్ డిజైన్ తో అందించింది మరియు ఇది ఈ ఫోన్ ను చూడటానికి చాలా ప్రీమియం ఫోన్ గా కనిపించేలా చేసింది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా వుంది మరియు ముందు వాటర్ డ్రాప్ సెల్ఫీ కెమెరా వుంది.
ఈ ఫోన్ ను పెద్ద స్క్రీన్ తో లాంచ్ చేస్తుందని ఐటెల్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో మంచి పెర్ఫార్మెన్స్ అందించే ప్రోసెసర్ ఉంటుందని కూడా ఐటెల్ చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో పెద్ద మెమొరీ ఉంటుందని కూడా ఐటెల్ పేర్కొంది. ఐటెల్ ప్రకారం, ఈ ఫోన్ స్టైలిష్ డిజైన్, డ్యూయల్ రియర్ కెమెరా, పెద్ద స్క్రీన్ మరియు అధిక స్టోరేజ్ తో ఈ ఫోన్ ఉంటుంది.
Also Read: Flipkart Year End సేల్ నుంచి OnePlus 12 పై 10 వేల భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ఈ ఫోన్ ఎలా ఉంటుంది ఈ ఫోన్ లాంచ్ నాటికి ఒక అవగాహన వస్తుంది.