ఇండియాలో 700 రూ లకు స్మార్ట్ ఫోన్స్ అనౌన్స్ చేసిన హాంగ్ కాంగ్ కంపెని

ఇండియాలో 700 రూ లకు స్మార్ట్ ఫోన్స్ అనౌన్స్ చేసిన హాంగ్ కాంగ్ కంపెని

Hong Kong బేస్డ్ Transsion Holdings మొబైల్ కంపెని ITEL అనే బ్రాండ్ తో ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యింది. కంపెని వెబ్ సైట్ లింక్.

కంపెని తమ ఫోనులు 700 రూ నుండి 7,000 రూ బడ్జెట్ లో ఉంటాయని చెబుతుంది. SmartSelfie, SmartPower and Shine అనే మూడు సిరీస్ లలో ఇవి వస్తాయి.

స్మార్ట్ సేల్ఫీ ఫోనులు పేరుకు తగ్గట్లుగానే ఫ్రంట్ కెమెరా కు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటాయి. స్మార్ట్ పవర్ ఫోనులు బ్యాటరీ కు ప్రాధాన్యత ఇస్తాయి. Shine రేంజ్ ఫోనులు లుక్స్ కు ప్రిఫరెన్స్ ఇస్తాయి.

ITEL ఇండియా సీఈఓ, సుదీర్ కుమార్ ఈ విషయాలను తెలిపారు. కంపెని ముందుగా SmartSelfie it2180, SmartPower it5600, SmartSelfie it5231, PowerPro it1410 and Wish it1508 మరియు ఫ్లాగ్ షిప్ మోడల్ SelfiePro it1511 లను లాంచ్ చేయనుంది.

SelfiePro it1511 ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో, 4G ఇంటర్నెట్ అండ్ డ్యూయల్ సిమ్ తో వస్తుంది. (అంటే మిగిలిన ఫోనుల్లో డ్యూయల్ సిమ్ ఉండదా అనే డౌట్ వస్తుంది కదా… కాని ప్రస్తుతం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా వెల్లడించలేదు కంపెని)

100 డేస్ ఫోన్ రిప్లేస్మెంట్ వారేంటి ఇస్తుంది కంపెని. అయితే గతంలో రింగింగ్ బెల్స్ Docoss అనే బ్రాండ్స్ కూడా చీప్ ప్రైసేస్ కు ఫోనులని చెప్పాయి. మరి హాంగ్ కాంగ్ నుండి వచ్చి మరీ చీప్ ఫోన్స్ అంటుంది Itel. వీటి సంగతేంటో విడుదల అయితేనే తెలుస్తుంది. ఫోన్స్ ఎప్పుడు లాంచ్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ లేదు.

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo