కేవలం 13 వేల ధరలో కర్వ్డ్ డిస్ప్లేతో itel S23+ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన ఐటెల్ ఇప్పుడు మరొక గుడ్ న్యూస్ తెలిపింది తెలిపింది. బడ్జెట్ యూజర్లను టార్గెట్ చేసుకొని తీసుకు వచ్చిన ఈ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ లో OTA అప్డేట్ ద్వారా కొత్త ఫీచర్ అందిస్తోంది. ఐఫోన్ ప్రీమియం ఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 15 లో అందించిన డైనమిక్ ఐస్ ల్యాండ్ ఫీచర్ మాదిరి ఫీచర్ ను ఇందులో జత చేస్తోంది. ఈ ఫోన్ చవక ధరలో వచ్చే కర్వ్డ్ ఫోన్ గా పేరుతెచ్చుకుంది. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ తో మరింత ఆకట్టుకుంటుంది.
ఐటెల్ ఎస్23+ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో రూ. 13,999 ధరకే లభిస్తుంది. ఈ ధర సెగ్మెంట్ లో 3D Curved AMOLED డిస్ప్లే కలిగిన ఏకైక ఫోన్ గా కూడా కొనియాడబడుతుంది. ఇప్పుడు కంపెనీ ఈ ఫోన్ పైన అందించిన కొత్త ఓటిఏ అప్డేట్ తో మరింతా ప్రాముఖ్యత సంతరించుకుంది. కొత్త అప్డేట్ తో ఈ ఫోన్ లో ఐఫోన్ ప్రీమియం లలో కనిపించే డైనమిక్ ఐస్ ల్యాండ్ మాదిరిగా నోటిఫికేషన్ బార్ సెల్ఫీ కెమేరా చుట్టూ కనిపిస్తుంది. ఈ ఫీచర్ తో ఈ ఫోన్ మరింత ప్రీమియం ఫోన్ లాగా కనిపిస్తుంది.
Also Read : YouTube: ప్రీమియం యూజర్ల కోసం AI Chatbot తెచ్చే పనిలో యూట్యూబ్
ఐటెల్ ఎస్23+ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ప్రత్యేకతలతో వస్తుంది. ఈ ఫోన్ 6.78 FHD+ 3D AMOLED డిస్ప్లేని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు Gorilla Glass 5 ప్రొటెక్షన్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T616 ఆక్టా కోర్ 4G ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 8GB RAM + 256 GB భారీ స్టోరేజ్ తో కూడా వస్తుంది.
ఈ ఫోన్ 50MP AI డ్యూయల్ కెమేరా మరియు 32MP సెల్ఫీ కెమేరాలతో వస్తుంది. ఇందులో Chat GPT అసిస్టెంట్ ను కూడా కంపెనీ అందించింది. అంతేకాదు, ఈ ఐటెల్ ఫోన్ 2 సంవత్సరాల వారెంటీతో కూడా వస్తుంది.