itel P55 series Launch: కొత్త ఫోన్లను లాంఛ్ చేస్తున్న ఐటెల్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!
itel P సిరీస్ నుండి రెండు కొత్త ఫోన్ లను లాంఛ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసింది
ఐటెల్ పి55 సిరీస్ నుండి పి55 మరియు పి55+ ఫోన్ లను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది
ఫోన్ లాంఛ్ డేట్ తో పాటుగా ఫోన్ టీజింగ్ ను కూడా కంపెనీ మొదలు పెట్టింది
itel P55 series Launch: ఐటెల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన P సిరీస్ నుండి రెండు కొత్త ఫోన్ లను లాంఛ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ ఐటెల్ పి55 సిరీస్ నుండి పి55 మరియు పి55+ ఫోన్ లను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంఛ్ డేట్ తో పాటుగా ఫోన్ టీజింగ్ ను కూడా కంపెనీ మొదలు పెట్టింది. ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ తో ఈ ఫోన్ టీజింగ్ ను అందించింది.
itel P55 series Launch
Power Play క్యాప్షన్ తో ఈ ఐటెల్ పి55 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను కంపెనీ టీజ్ చేస్తోంది. ఈ ఫోన్ లను కొత్త డిజైన్ తో లాంఛ్ చేయనున్నట్లు, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లను చూస్తుంటే అర్ధమవుతుంది. కేవలం 10 వేల రూపాయల ధరలో మార్కెట్ అత్యంత చవకైన 5G Smartphone ను తీసుకు వచ్చిన ఐటెల్ కంపెనీ, ఐ కొత్త ఫోన్ లను ఎటువంటి ధరలో తీసుకు వస్తుందో అని అంచనాలు మొదలు పెట్టారు.
ఈ సిరీస్ ఫోన్లు కలిగి ఉండనున్న ఫీచర్స్ మరియు స్పెక్స్ ను కూడా టీజింగ్ ద్వారా ముందుగానే అందించింది. ఈ ఫోన్ అమేజాన్ స్పెషల్ గా లాంఛ్ చేస్తోంది. అందుకే, అమేజాన్ ఇండియా ఈ ఫోన్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది.
Also Read: Lava Yuva 3: అట్రాక్టివ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో చవక ధరలో వచ్చింది.!
ఐటెల్ పి55+ టీజ్డ్ స్పెక్స్
అమేజాన్ మైక్రో సైట్ పేజ్ ద్వారా ఐటెల్ పి55+ టీజ్డ్ స్పెక్స్ స్మార్ట్ ఫోన్ ను 3D స్టిచ్చింగ్ తో వేగాన్ లెథర్ ఫినిష్ కలిగిన బ్యాక్ ప్యానల్ తో వస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ చాలా సన్నగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఐటెల్ పి55+ ఫోన్ 50MP డ్యూయల్ కెమేరా సెటప్ ని AI క్లియర్ పోర్ట్రైట్, సూపర్ నైట్ మోడ్ మరియు పనోరమా మోడ్ వంటి మరిన్ని కెమేరా ఫీచర్లతో లాంఛ్ చేయబోతునట్లు టీజింగ్ చేస్తోంది.
ఐటెల్ పి55+ ఫోన్ లో అందించిన మెమొరీ ఫ్యూజన్ ఫీచర్ తో టోటల్ 16GB RAM ప్రయోజనాన్ని అందిస్తుందని కూడా తెలిపింది. అలాగే, ఈ ఫోన్ ను 256GB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ తో లాంఛ్ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ ఉన్నట్లు టీజర్ నుండి కన్ఫర్మ్ చేసింది.
ఐటెల్ పి55 టీజ్డ్ స్పెక్స్
ఈ ఫోన్ కూడా అందమైన డిజైన్ తోనే కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమేరాని ఫ్లాష్ సెటప్ తో కలిగి వుంది.