itel Flip One: భారత మార్కెట్ లో కొత్త ఫ్లిప్ ఫోన్ ను ఐటెల్ లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ ఫోన్ లను విరివిగా అందిస్తున్న మొబైల్ కంపెనీలలో ఒకటైన ఐటెల్ ఈ కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం రూ. 3,000 రూపాయల ఉప బడ్జెట్ లో విడుదల చేసింది ఐటెల్ సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫీచర్ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
ఐటెల్ ఫ్లిప్ వన్ ఫీచర్ ఫోన్ ను కేవలం రూ. 2,499 ధరలో విడుదల చేసింది. ఈ ఫీచర్ ఫోన్ ఆరెంజ్, లైట్ బ్లూ మరియు బ్లాక్ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.
Also Read: Flipkart నుంచి ఈరోజు చవక ధరకే లభిస్తున్న Apple iPhone 12
ఐటెల్ ఫ్లిప్ వన్ ఫీచర్ ఫోన్ ను స్టైలిష్ డిజైన్ మరియు ప్రీమియం లెథర్ టెక్చర్డ్ బ్యాక్ తో విడుదల చేసింది. ఈ ఫీచర్ ఫోన్ 2.4 ఇంచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ OVGA స్క్రీన్ మరియు ఇది మంచి క్వాలిటీ విజువల్స్ అందిస్తుందని ఐటెల్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో గ్లాస్ కీ ప్యాడ్ ఉంటుంది. ఈ ఫ్లిప్ ఫీచర్ ఫోన్ 13 రీజనల్ బాష లకు సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా, ఈ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ తో పాటు లైట్ వైట్ తో ఆకర్షణీయమైన ఆప్షన్ గా మారుతుందని ఐటెల్ చెబుతోంది.
ఈ ఐటెల్ ఫీచర్ ఫ్లిప్ ఫోన్ 7 రోజులు పవర్ బ్యాకప్ అందించగల పెద్ద 1200 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో టైప్ C సపోర్ట్ తో ఇది యూనివర్సల్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బడ్జెట్ ఫోన్ గా కూడా నిలుస్తుంది. ఈ ఐటెల్ ఫీచర్ ఫోన్ BT కాలింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ SIM కార్డ్ సపోర్ట్ మరియు VGA కెమెరా కూడా ఉన్నాయి.