ఐటెల్ కూడా ఇండియాలో చాలా వేగంగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. కొత్త సంవత్సరంలో రెండు కొత్త ఫోన్ లను ఐటెల్ అనౌన్స్ చేసింది. జనవరి 9వ తేదీ Zeno 10 ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఐటెల్, ఇప్పుడు సైలెంట్ గా itel A80 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ ను రూ. 6,999 ధరలో 50MP HDR కెమెరా వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ చేసింది.
ఐటెల్ A80 స్మార్ట్ ఫోన్ ను 4GB + 128GB సింగల్ వేరియంట్ ను రూ. 6,999 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్స్ నుంచి సేల్ కిలో అందుబాటులోకి వస్తుందని ఐటెల్ తెలిపింది. ఈ కొత్త ఫోన్ పైన 100 డేస్ స్క్రీన్ రిప్లేస్మెంట్ ఆఫర్ ను కూడా అందించింది. అంటే, ఈ ఫోన్ కొనుగోలు చేసిన 100 రోజులు స్క్రీన్ లో ఏదైనా లోపం తలెత్తితే కొత్త స్క్రీన్ ను ఉచితంగా రీప్లేస్ చేస్తుంది.
Also Read: Samsung Dolby Atmos సౌండ్ బార్ మంచి డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది.!
ఐటెల్ A80 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ బిగ్ స్క్రీన్ ను HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను Unisoc T 603 ప్రోసెసర్ మరియు జతగా 4GB ఫిజికల్ ర్యామ్ మరియు 4GB ఎక్స్టెండెడ్ ర్యామ్ తో టోటల్ 8GB ఫీచర్ ను అందిస్తుంది. ఐటెల్ ఎ80 ఫోన్ లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ ఫోన్.
ఇక ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరాని HDR సపోర్ట్ తో అందించింది మరియు ఇందులో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ను 10W సాధారణ వేగమైన ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది.