షావోమి మి 9 ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్ తో అదరగొట్టనుందా?
మి 9 యొక్క ర్యామ్ మరియు స్టోరేజి వేరియంట్లను గురించి చెప్పిన, టిప్స్టర్ ఇషాన్ అగర్వాల్.
రేపు చైనాలో విడుదలకానున్న స్మార్ట్ ఫోన్ గురించి అనేక లీకులు మరియు అంచనాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ముందుగా, ఈ స్మార్ట్ ఫోన్ గురించిన వివరాను సంస్థ యొక్క కో ఫౌండర్ మరియు CEO అయిన లీ జున్ అధికారికంగా లీక్ చేసిన విషయం మనకు తెలుసు. అయితే, ఈ మి 9 యొక్క ర్యామ్ మరియు స్టోరేజి వేరియట్ల గురించి ఇప్పుడు, టిప్స్టర్ ఇషాన్ అగర్వాల్ పేర్కొన్నారు.ఇషాన్ అగర్వాల్ ప్రకారం, షావోమి మి 9 6GB RAM మరియు 128 GB స్టోరేజి,8GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్లను సూచించారు.
దీనితో పాటుగా, ట్రాన్స్పరెంట్ బ్యాక్ తో కూడిన ఒక 8GB RAM/ 128GB స్టోరేజి మరియు గరిష్టంగా ఒక 12GB RAM +256GB వేరియంట్ కూడా ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇంతకు ముందుగా, ఈ మి 9 యొక్క 12GB ర్యామ్ వేరియంట్ గురించి, ఇటీవలే షావోమి యొక్క CEO కూడా ద్రువీకరించడం, ఈ మాటలకి ఊతాన్నిచేలా చేస్తున్నాయి. అంతేకాకుండా, ఈ కంపెనీ భవిష్యత్తులో ఒక మి 9 SE ని కూడా ప్రకటించవచ్చని కూడా ఒక హింట్ ఇచ్చారు.
ముందుగా పోస్ట్ చేసిన ఇమేజిల ద్వారా ఈ మి 9 యొక్క చాల వివరాలు వెల్లడయ్యాయి. ఇది 90.7 శాతం స్క్రీన్ -టూ -బాడీ రేషియాతో ఒక వాటర్డ్రోప్ నోచ్ రూపకల్పనను కలిగివుంటుందని, మనకు ఇప్పటికే తెలుసు. అయితే, Xiaomi Mi 9 ఒక పూర్తి HD + స్పష్టత అందించే శామ్సంగ్ యొక్క AMOLED ప్యానెల్ కలిగి ఉంటుంది. ఇది 600 nit అత్యధికంగా బ్రైట్నెస్ కలిగి ఉంటుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ద్వారా రక్షించబడుతునట్లు ఇప్పుడు ప్రకటించింది.
షావోమి మి 9 డిస్ప్లే పరిమాణం వెల్లడించలేదు కానీ , ఈ ఫోన్ యొక్క డిస్ప్లేలో ఒక ఆప్టికల్ వేలిముద్ర సెన్సార్ ఉన్నట్లు ధ్రువీకరించారు. ఈ డిస్ప్లేలో సన్ లైట్ మోడ్ 2.0 మరియు రీడింగ్ మోడ్ 2.0 వంటి ఫీచర్లు ఉంటాయి, ఇవి పరిసర కాంతి పరిస్థితులకు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్నెస్ మెరుగుపర్చడానికి సహాయపడతాయి. అంతేకాకుండా, ఈ ఫోన్ తాజా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 SoC తో నడుస్తుంది, దీనిని 7nm ప్రాసెస్ ఉపయోగించి తయారు చేస్తారు. షావోమి కొత్త ప్రాసెసర్ ఎక్విపింగ్ తర్వాత, Mi 9 Antutu బెంచ్మార్క్ వద్ద 387,851 స్కోర్లు సాధించినట్లు చెబుతోంది. ఇది Antutu జాబితాలో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ చేస్తూ ఉన్నదాని కంటే ఎక్కువగా ఉంటుంది, దీని మి మిక్స్ 2S స్మార్ట్ ఫోన్ 297,077 స్కోరుతో ఉంటుంది.
ఆప్టిక్స్ పరంగా, Mi 9 ఒక ట్రిపుల్ – వెనుక కెమెరా సెటప్పును కలిగి ఉంటుంది. ఇది 0.8 μm పిక్సెల్ పిచ్ మరియు ఒక 1/2-inch ఇమేజ్ సెన్సరుతో 48MP ప్రధాన సోనీ IMX586 సెన్సార్ను కలిగి ఉంది. ఇది 4-in-1 పిక్సెల్ బిన్నింగుకు మద్దతు ఇస్తుంది మరియు 6P లెన్స్ ను కలిగి ఉంది. ఇంకా, ఒక 16 MP అల్ట్రా వైడ్ యాంగిల్ మరియు ఒక 12MP టెలిఫోటో లెన్స్ ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాలో ఉంటాయి. ఈ అల్ట్రా వైడ్-యాంగిల్ లెన్స్ ఒక f / 2.2 ఎపర్చరు మరియు 117-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగివుంటుంది. ఇక ఈ 12MP టెలిఫోటో కెమెరాకి f / 2.2 ఎపర్చర్ కూడా లభిస్తుంది, కానీ 1.0 μm యొక్క పిక్సెల్ పరిమాణం వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రధాన కెమెరా PDAF మరియు CDAF మద్దతుతో లేజర్ ఆటోఫోకస్లను మరియు సప్పైర్ బ్లూ గ్లాస్ రక్షణను పొందుతుంది. ఈ ఫోన్ యొక్క ముందు కెమెరా యొక్క సమాచారాన్నిమాత్రం విడుదల చేయలేదు.
మి 9 "అసాధారణమైన ధ్వని నాణ్యత" ను అందిస్తుందని షావోమి చెప్పింది, ఇది 0.9 cc వంటి పెద్ద స్పీకర్ బాక్సుకు సమానం. అదనంగా, ఈ హ్యాండ్ సెట్ ఒక గేమ్ టర్బో లక్షణాన్ని కలిగి ఉంటుంది, ఇది వినియోగదారులను రియల్ టైం లో CPU / GPU / FPS ను పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది. ఇది "గేమింగ్ సన్నివేశాలను అంచనా వేస్తుంది మరియు సంక్లిష్టంమైన సన్నివేశాల కోసం వనరులను కేటాయిస్తుంది." ఈ లక్షణం ఎలా పని చేస్తుందో వివరణాత్మక సమాచారం ఇంకా తెలియపరచలేదు. షావోమి మి 9, లావెండర్ వైలెట్, ఓషన్ బ్లూ, మరియు పియానో బ్లాక్ వంటి మూడు రంగులలో వస్తుంది.
షావోమి మి 9 : బ్యాటిల్ ఏంజెల్, అని పిలువబడే ఈ పరికరం యొక్క ఒక ప్రత్యేక నాల్గవ వేరియంట్ ఫిబ్రవరి 24 న ప్రారంభించబడుతుంది. కంపెనీ వ్యవస్థాపకుడు లీ జున్ , Mi 9 పారదర్శక ఎడిషన్ యొక్క కొన్ని వివరాలను వెల్లడించారు. ఇది 48MP ప్రాధమిక వెనుక కెమెరా 6P లెన్సుకు బదులుగా, ఇది ఒక 7P లెన్సుతో f / 1.47 ఎపర్చరుతో అందించబడుతుంది. ఈ ఫోన్ యొక్క మిగిలిన లక్షణాలు Mi 9 వలెనే ఉండవచ్చని భావిస్తున్నారు.
Exclusive: Xiaomi Mi 9 will come in two storage variants: 6GB+128GB & 8GB+128GB and three colours: Deep Space Grey, Holographic Illusion Blue & Holographic Illusion Purple. Mi 9 transparent (EE) will come in 8GB+128GB and 12GB(!!)+ 256GB. Mi 9 SE is launching but maybe later. pic.twitter.com/6BrmbFYXo2
— Ishan Agarwal (@ishanagarwal24) February 19, 2019