iQOO Z9X 5G: ఐకూ Z9 సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తోంది. ఈ సిరీస్ నుంచి ఇటీవల ఐకూ జెడ్ 9 ఫోన్ ను 20 వేల బడ్జెట్ కేటగిరిలో విడుదల చేసిన ఐకూ, ఇదే సిరీస్ నుంచి ఈ Z9X 5G ఫోన్ ను కూడా తీసుకు వస్తోంది. ఈ ఫోన్ రేపు ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతోంది. ఈ ఫోన్ విడుదల కంటే ముందే ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.
అప్ కమింగ్ ఫోన్ ఫీచర్స్ గురించి ఐకూ ముందు నుంచి చెబుతోంది. ఈ ఫోన్ టీజర్ పేజీ ద్వారా ఈ వివరాలతో టీజింగ్ అందించింది. ఈ ఫోన్ Snapdragon 6 Gen 1 చిప్ సెట్ తో వస్తోంది. ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ పెంచడానికి వీలుగా ఈ ప్రోసెసర్ కి జతగా 8GB RAM + 8GB ఎక్స్టెండెడ్ ర్యామ్ తో టోటల్ 16GB RAM సపోర్ట్ ఉందని ఐకూ తెలిపింది.
ఐకూ జెడ్ 9x 5జి ఫోన్ లో 6.72 ఇంచ్ బిగ్ డిస్ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వుంది. ఈ ఫోన్ ను భారీ 6000 mAh బ్యాటరీ మరియు 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా కంపెనీ తెలిపింది.
Also Read: ఈరోజు Amazon నుండి రూ. 8,699 కే ఈ పెద్ద Smart Tv అందుకోండి.!
ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో అందించి ఆడియో సపోర్ట్ వివరాలను కూడా ఐకూ తెలిపింది. ఈ ఫోన్ లో Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో వస్తుందని మరియు ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నట్లు కూడా తెలిపింది. అంతేకాదు, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో IP54 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ కలిగిన మొదటి ఫోన్ ఇదే అవుతుందని కూడా చెబుతోంది.
ఈ ఫోన్ కెమెరా సెటప్ ను కూడా ఐకూ టీజర్ ద్వారా కనర్మ్ చేసింది. ఈ ఫోన్ లో వెనుక 5MP డ్యూయల్ రియర్ కెమెరా డ్యూయల్ LED ఫ్లాష్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ ను Funtouch OS 14 సాఫ్ట్ వేర్ తో Android 14 OS తో లాంచ్ చేస్తున్నట్లు కూడా క్లియర్ చేసింది.