iQOO Z9s: కర్వుడ్ AMOLED డిస్ప్లే మరియు AI పవర్డ్ కెమెరాతో వచ్చే వారం లాంచ్ అవుతుంది.!

iQOO Z9s: కర్వుడ్ AMOLED డిస్ప్లే మరియు AI పవర్డ్ కెమెరాతో వచ్చే వారం లాంచ్ అవుతుంది.!
HIGHLIGHTS

ఐకూ Z9 నుంచి రెండు కొత్త ఫోన్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది

ఈ సిరీస్ లో ఐకూ Z9s మరియు ఐకూ Z9s ప్రో స్మార్ట్ ఫోన్ లు వున్నాయి

iQOO Z9s ని AI పవర్డ్ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది

iQOO Z9s: ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ Z9 నుంచి రెండు కొత్త ఫోన్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్ లో ఐకూ Z9s మరియు ఐకూ Z9s ప్రో స్మార్ట్ ఫోన్ లు వున్నాయి. ఈ సిరీస్ నుంచి విడుదల చేయబోతున్న బేసిక్ వేరియంట్ ఐకూ Z9s స్మార్ట్ ఫోన్ ను కూడా కర్వ్డ్ AMOLED డిస్ప్లే మరియు AI పవర్డ్ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. కేవలం ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ మరిన్ని లేటెస్ట్ ట్రెండీ ఫీచర్ లను కూడా కలిగి ఉన్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.

iQOO Z9s: లాంచ్

ఐకూ ఈ స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే అమెజాన్ ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లతో టీజింగ్ చేస్తోంది.

iQOO Z9s: ఫీచర్లు

ఐకూ Z9s స్మార్ట్ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 3D Curved AMOLED డిస్ప్లే తో ఉన్నట్లు ఐకూ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ చాలా అందంగా మరియు కంఫర్ట్ ఫీల్ అందించే స్లీక్ డిజైన్ తో అందిస్తున్నట్లు కూడా ఐకూ తెలిపింది. ఈ ఫోన్ కేవలం 0.749cm మందంతో చాలా స్లీక్ ఉంటుందిట. ఐకూ Z9s స్మార్ట్ ఫోన్ 7 లక్షలకు పైగా AnTuTu స్కోర్ కలిగిన మీడియాటెక్ Dimensity 7300 చిప్ సెట్ తో పని చేస్తుంది.

iQOO Z9s
iQOO Z9s

ఈ ఫోన్ లో చాలా స్లీక్ డిజైన్ తో ఉన్నా కూడా ఈ ఫోన్ ను 5000 mAh పవర్ ఫుల్ బ్యాటరీ తో ప్యాక్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఇక ఈ ఫోన్ కలిగి ఉన్న కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50MP (Sony IMX 882) + 2MP పోర్ట్రైట్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో కెమెరా కి సపోర్ట్ గా ఆరా రింగ్ ఫ్లాష్ కూడా వుంది.

Also Read: OnePlus Buds Pro 3: లెథర్ లాంటి టెక్స్చర్ మరియు ప్రీమియం ఫీచర్స్ తో వస్తోంది.!

అంతేకాదు, ఈ ఫోన్ కెమెరా తో AI ఫీచర్లు కూడా ఉన్నట్లు ఐకూ తెలిపింది. ఇందులో AI ఎరేజర్, AI ఫోటో ఎన్ హెన్స్ మరియు మరిన్ని AI ఫీచర్లు ఉన్నట్లు ఐకూ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo