iQOO Z9s Series: భారత మార్కెట్లో ఐకూ Z9s సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. రేపు మధ్యాహ్నం విడుదల చేస్తుంది. ఐకూ జెడ్ 9s సిరీస్ నుంచి జెడ్ 9s మరియు జెడ్ 9s ప్రో రెండు ఫోన్లు ఐకూ విడుదల చేస్తుంది. విడుదల కంటే ముందే ఈ రెండు ఫోన్స్ ఫీచర్లు మరియు ఇతర వివరాల పై ఒక లుక్కేద్దాం పదండి.
ఐకూ Z9s సిరీస్ నుంచి Z9s మరియు Z9s Pro రెండు ఫోన్లు ఐకూ విడుదల చేస్తోంది. వీటిలో Z9s ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరాతో ఉండగా, Z9s ప్రో ఫోన్ మాత్రం ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా 120Hz 3D Curved AMOLED స్క్రీన్ ను 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటాయి. అలాగే, ఈ రెండు ఫోన్లు కూడా వెనుక Aura రింగ్ లైట్ తో వస్తాయి. ఈ ఫోన్స్ డిజైన్ లో కూడా కొంత వ్యత్యాసం ఉంటుంది.
ఈ రెండు ఫోన్ లలో Z9s ప్రో వెర్షన్ ప్రీమియం వేగాన్ లెథర్ డిజైన్ వస్తుంది మరియు వెనుక సరికొత్త కెమెరా డిజైన్ తో ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ కలిగి ఉన్న చిప్ సెట్ విషయానికి వస్తే, Z9s ప్రో స్మార్ట్ ఫోన్ Snapdragon 7 Gen 3 తో పని చేస్తుంది. అయితే, Z9s స్మార్ట్ ఫోన్ మాత్రం మీడియాటెక్ Dimensity 7300 చిప్ సెట్ తో పని చేస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ లను అతి సన్నని 7.49mm మందంతో చాలా నాజూకైన డిజైన్ తో ఉంటుంది.
Also Read: ఈరోజు నుంచి మొదలైన vivo V40 5G Series సేల్: ప్రైస్ మరియు ఆఫర్లు తెలుసుకోండి.!
ఇక ఈ ఫోన్ లో అందించిన బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లలో 5500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటాయి. అలాగే, ఈ రెండు ఫోన్లు కూడా 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటాయి. ఈ ఫోన్లలో ప్రో వెర్షన్ 50MP Sony IMX882 జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లలో AI Camera ఫీచర్స్ ఉన్నట్లు కూడా ఐకూ కన్ఫర్మ్ చేసింది.
ఐకూ Z9s సిరీస్ రేపు అనగా ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. రేపు ఈ ఫోన్ ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ తో మీ ముందుకు వస్తాం.