iQOO Z9s Series నుంచి రెండు కొత్త ఫోన్లు భారత మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ఐకూ తెలిపింది. ఈ సిరీస్ నుంచి ఐకూ Z9s మరియు ఐకూ Z9s ప్రో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు ఐకూ ప్రకటించింది. ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తో ఈ ఫోన్ టీజింగ్ క్యాంపైన్ ను కూడా ఐకూ మొదలుపెట్టింది. ఐకూ త్వరలో లాంచ్ చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ పైన ఒక లుక్కేద్దామా.
ఐకూ Z9s సిరీస్ ను ఆగస్టు 21 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం సేల్ పార్ట్నర్ గా అమెజాన్ ఇండియా ను ఎంచుకుంది. అందుకే, ఈ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజిని అందించి టీజింగ్ చేస్తోంది అమెజాన్.
ఐకూ ఈ సిరీస్ నుంచి ఐకూ Z9s మరియు ఐకూ Z9s ప్రో ఫోన్ లను తీసుకొస్తోంది. ఈ రెండు ఫోన్లలో ఐకూ Z9s ఫోన్ ఫ్లాట్ స్క్రీన్ తో మరియు ఐకూ Z9s ప్రో కర్వుడ్ స్క్రీన్ తో వస్తాయి. ఈ సిరీస్ నుంచి అందించనున్న ఫోన్ లలో ఐకూ Z9s ప్రో కీలకమైన ఫీచర్స్ ను కంపెనీ ఇప్పటికే బయటపెట్టింది. అయితే, ఐకూ Z9s ఫోన్ యొక్క డిజైన్ వివరాలు మాత్రమే ప్రస్తుతానికి వెల్లడించింది.
ఐకూ Z9s ప్రో స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7 Gen 3 ప్రోసెసర్ తో తీసుకు వస్తోంది. ఇది 4nm TSMC చిప్ సెట్ మరియు 8,20,000 పైగా AnTuTu స్కోర్ ను అందిస్తుందని కూడా ఐకూ తెలిపింది. ఈ ఫోన్ 3D కర్వుడ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 లోకల్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది.
Also Read: Amazon GFF Sale 2024: ఐఫోన్ 13 పై అమెజాన్ అప్ కమింగ్ సేల్ జబర్దస్త్ ఆఫర్.!
ఈ ఫోన్ లో వెనుక రింగ్ ఫ్లాష్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం వుంది. అయితే, ఇందులో ఎటువంటి కెమెరాలు ఉన్నాయని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఈ ఫోన్ ను ఫ్లామ్ బోయాంట్ ఆరెంజ్ మరియు లక్సే మార్బుల్ రెండు కలర్ లలో లాంచ్ చేస్తున్నట్లు కూడా ఐకూ తెలిపింది.
ఇక ఐకూ Z9s ఫోన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ డిజైన్ తో టీజింగ్ ఐకూ చేస్తోంది. టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ ను ప్రీమియం డిజైన్ లాంచ్ తో చేస్తున్నట్లు కూడా అర్ధం అవుతోంది. ఈ ఫోన్ అప్డేట్ ను కంపెనీ మెలమెల్లగా చేస్తుంది. ఈ ఫోన్ యొక్క కొత్త అప్డేట్ తో మళ్ళి కలుద్దాం.