iQOO Z9s Series ఆగస్టు 21వ తేదీ ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ఐకూ ప్రకటించింది. ఈ సిరీస్ నుంచి ఐకూ Z9s తో పాటు Z9s ప్రో ను కూడా విడుదల చేయబోతున్నట్లు ఐకూ అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఐకూ Z9s ప్రో ఫోన్ ఫీచర్స్ తో ఫోన్ టీజింగ్ వేగాన్ని మరింత పెంచింది. ఈ ఫోన్ 4K OIS వీడియో కెమెరా మరియు స్టన్నింగ్ డిజైన్ తో వస్తోందని కంపెనీ గొప్పగా చెబుతోంది.
ఐకూ Z9s ప్రో స్మార్ట్ ఫోన్ ఆగస్టు 21వ తేదీ ఇండియాలో విడుదల అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ గురించి అమెజాన్ ద్వారా టీజింగ్ చేస్తోంది. లాంచ్ అయిన తరువాత ఈ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ అందించిన టీజర్ పేజ్ ద్వారా ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ను కూడా అందించింది.
ఐకూ Z9s ప్రో స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ మిడ్ రేంజ్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 7 Gen 3 తో అందిస్తోంది. ఈ క్వాల్కమ్ ప్రొసెసర్ 4nm TSMC చిప్ సెట్ మరియు 8,20,000 ప్లస్ AnTuTu స్కోర్ ను అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 3D కర్వుడ్ AMOLED డిస్ప్లే తో ఉంటుందని కోడోత్ ఐకూ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ను కాలంగా ఉంటుంది మరియు 4500 గరిష్ట లోకల్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది.
ఈ ఫోన్ IP 64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ అందమైన కలర్ మరియు చాలా స్లీక్ డిజైన్ తో చాలా ఆకర్షణగా కనిపిస్తోంది. ఈ ఫోన్ ప్రీమియం ఫ్లామ్ బోయంట్ ఆరెంజ్ లెథర్ కలర్ మరియు లక్సి మార్బల్ కలర్ ఆప్షన్ లలో కనిపిస్తోంది.
Also Read: Amazon Sale: లాస్ట్ మినిట్ లో Panasonic స్మార్ట్ టీవీ అమెజాన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్.!
ఈ ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX882 + 8MP డ్యూయల్ రియర్ కెమేరా కలిగి ఉంటుంది. ఇది OIS తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుందని ఐకూ తెలిపింది. అంతేకాదు, ఫోటోగ్రఫీ కి తగిన Aura రింగ్ లైన్ ను కూడా కలిగి వుంది. ఇదిమాత్రమే కాదు ఈ ఫోన్ సూపర్ నైట్ మోడ్ AI ఫోటో ఎన్ హెన్సర్ మరియు AI ఎరేజర్ వంటి చాలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ లు కలిగి ఉన్నట్లు ఐకూ తెలిపింది. ఈ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీని 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కల్గి ఉందని కూడా ఐకూ తెలిపింది.