iQOO Z9s Pro 5G: భారీ ఆఫర్లతో మొదలైన ఐకూ కొత్త ఫోన్ సేల్.!

Updated on 25-Aug-2024
HIGHLIGHTS

iQOO Z9s Pro 5G భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది

మెజాన్ ఇండియా ద్వారా మంచి డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ సేల్ అవుతోంది

ఈ ఫోన్ లో 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీ వుంది

iQOO Z9s Pro 5G: ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఐకూ Z9s ప్రో స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఐకూ రీసెంట్ గా విడుదల చేసిన ఈ బడ్జెట్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ ఆఫర్ తో మరింత తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది. అమెజాన్ ఇండియా ద్వారా మంచి డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ సేల్ అవుతోంది.

iQOO Z9s Pro 5G: ప్రైస్ మరియు ఆఫర్

ఐకూ Z9s ప్రో 5జి స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 24,999 ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ (8GB + 256GB) ని రూ. 26,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ (12GB + 256GB) ను రూ. 28,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి సేల్ అవుతోంది.

ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 భారీ తగ్గింపు లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ ను రూ. 22,999 ధరకు, రెండవ వేరియంట్ ను రూ. 24,999 ధరకు మరియు హై ఎండ్ వేరియంట్ ను రూ. 26,999 ధరకి పొందవచ్చు.

Also Read: Vivo T3 Pro ఫోన్ 50MP Sony IMX 882 కెమెరా మరియు కర్వుడ్ స్క్రీన్ తో వస్తోంది.!

iQOO Z9s Pro 5G: ఫీచర్స్

ఐకూ Z9s ప్రో స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ కేవలం 7.49 మందంతో చాలా నాజూకుగా ఉంటుంది. అయినా సరే ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన పెద్ద 3D కర్వుడ్ AMOELD స్క్రీన్ ను కలిగి వుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో క్వాల్కమ్ పవర్ ఫుల్ ప్రోసెసర్ అయిన Snapdragon 7 Gen 3 తో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది.

ఈ ఫోన్ లో 8GB మరియు 12 GB ర్యామ్ వేరియంట్ మరియు 128GB మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లో వెనుక OIS సపోర్టెడ్ 50MP Sony IMX882 మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ IP64 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లో 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీ వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :