iQOO Z9s 5G ఆకట్టుకునే ఐదు ఫీచర్స్ తో 20 వేల ఉప బడ్జెట్ లో వచ్చింది.!
iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ ను ఐకూ ఈరోజు ఇండియాలో విడుదల చేసింది
ఈరోజు iQOO Z9s 5G series నుంచి Z9s మరియు Z9s Pro రెండు ఫోన్లు విడుదల చేసింది
జెడ్ 9s స్మార్ట్ ఫోన్ ను 20 వేల ఉప బడ్జెట్ లో ఆకట్టుకునే ఐదు ఫీచర్స్ తో లాంచ్ చేసింది
iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ ను ఐకూ ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. వాస్తవానికి, ఈరోజు iQOO Z9s 5G series నుంచి Z9s మరియు Z9s Pro రెండు ఫోన్లు విడుదల చేసింది. వీటిలో జెడ్ 9s స్మార్ట్ ఫోన్ ను 20 వేల ఉప బడ్జెట్ లో ఆకట్టుకునే ఐదు ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో కంపెనీ అందించిన ఆ ఐదు ప్రత్యేకమైన ఫీచర్స్, ఫోన్ ధర మరియు కంపెనీ అందించిన ఆఫర్ వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
iQOO Z9s 5G : ధర
ముందుగా ఈ ఐకూ కొత్త ఫోన్ ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ ను రూ. 19,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఆగస్టు 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ Amazon నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఆఫర్లు
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ పై మంచి లాంచ్ ఆఫర్లు కూడా ఐకూ అందించింది. ఈ ఫోన్ లను ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ లేదా పాత ఫోన్ తో ఎక్స్ చేంజ్ ఆఫర్ తో ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను రూ. 17,999 రూపాయల ప్రారంభ ధరకే అందుకోవచ్చు.
iQOO Z9s 5G : టాప్ 5 ఫీచర్స్
డిజైన్
ఐకూ జెడ్ 9s స్మార్ట్ ఫోనెను చాలా సన్నని 7.49mm నాజూకైన డిజైన్ తో, కర్వుడ్ ఫోన్ లలో స్లిమ్మెస్ట్ ఫోన్ గా అందించింది. ఇది చాలా ప్రీమియం లుక్స్ తో ఉంటుంది మరియు టైటానియం మాట్టే మరియు ఆక్సి గ్రీన్ రెండు కలర్ లలో లభిస్తుంది.
స్క్రీన్
జెడ్ 9s స్మార్ట్ ఫోన్ లో 6.67 ఇంచ్ 3D Curved AMOLED స్క్రీన్ ను కలిగి వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఇది కంటెంట్ మరియు గేమింగ్ కి అనువుగా ఉంచుతుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి వుంది.
పెర్ఫార్మెన్స్
ఐకూ ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 చిప్ సెట్ తో అందించింది. ఇది 4nm TSMC ప్రొసెస్ టెక్నాలజీ చిప్ సెట్ మరియు ఇది 7 లక్షలకు పైగా AnTuTu స్కోర్ ను అందిస్తుంది. దీనికి జతగా 8GB / 12GB ర్యామ్ మరియు 128GB / 256GB ఇంటర్నల్ స్టోరేజ్ లతో వస్తుంది.
Also Read: JioTv+: 800 కంటే అధిక ఛానల్స్ మరియు 14 OTT లతో కొత్త సర్వీస్ ప్రారంభించిన జియో.!
కెమెరా
ఈ ఐకూ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50MP (Sony IMX882) ప్రధాన కెమెరా మరియు 2MP పోర్ట్రైట్ కెమెరా వున్నాయి. అంతేకాదు, ఈ కెమెరాతో OIS తో అన్ షేక్ 4K వీడియోలు మరియు AI ఫీచర్స్ తో గొప్ప ఫోటోలు పొందవచ్చు.
బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్
ఐకూ ఈ స్మార్ట్ ఫోన్ ను 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీ ని కలిగి ఉంటుంది.