బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వచ్చిన iQOO Z9s 5G First Sale రేపు మొదలవుతుంది.!

బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వచ్చిన iQOO Z9s 5G First Sale రేపు మొదలవుతుంది.!
HIGHLIGHTS

iQOO Z9s 5G First Sale రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది

3D కర్వుడ్ AMOLED స్క్రీన్ మరియు Sony కెమెరా ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది

ఈ ఫోన్ మొదటి సేల్ నుంచి మంచి ఆఫర్లు కూడా ఐకూ అందించింది

iQOO Z9s 5G First Sale రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. 20 వేల రూపాయల బడ్జెట్ కేటగిరిలో అత్యంత ప్రకాశవంతమైన 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ మరియు Sony కెమెరా ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ మొదటి సేల్ నుంచి మంచి ఆఫర్లు కూడా ఐకూ అందించింది. ఈ ఫోన్ సేల్ కంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ అందించాము.

iQOO Z9s 5G First Sale

ఐకూ జెడ్ 9s 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 19,999 రూపాయల ప్రారంభ ధరతో ఐకూ లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొదటి ఆగస్టు 29 వ తేదీ, అనగా సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి సేల్ అవుతుంది మరియు iqoo.com/in నుంచి కూడా లభిస్తుంది.

ఆఫర్స్

ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ లేదా ఎక్స్ చేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకునే అవకాశం అందించింది.

iQOO Z9s 5G : ఫీచర్స్

ఐకూ జెడ్ 9s 5జి స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో 4500 లోకల్ బ్రైట్నెస్ కలిగిన 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉన్న ఫోన్ అని ఐకూ తెలిపింది. ఈ స్క్రీన్ 6.77 ఇంచ్ సైజుతో, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 100% P3 కలర్ గ్యాముట్ తో వస్తుంది. ఈ ఫోన్ ను Dimensity 7300 5G చిప్ సెట్ తో జతగా 8GB ర్యామ్ మరియు 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో అందించింది.

iQOO Z9s 5G First Sale

ఈ ఫోన్ కెమెరా పరంగా మంచి సెన్సార్ లు మరియు ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో వెనుక OIS సపోర్ట్ తో 50 MP Sony IMX883 ప్రధాన సెన్సార్ + 2 MP బొకే సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా వుంది మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ AI ఫోటో ఎన్ హెన్ మరియు AI ఎరేజ్ వంటి మరిన్ని కెమెరా ఫీచర్స్ ను కలిగి వుంది.

Also Read: భారీ ఆఫర్లతో ఈరోజు నుంచి మొదలైన Motorola g45 5G స్మార్ట్ ఫోన్ సేల్.!

ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4D గేమింగ్ వైబ్రేషన్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo