iQOO Z9 5G: మతిపోగోట్టే డిజైన్ మరియు ఫీచర్స్ తో వస్తోంది. ఐకూ సక్సెస్ ఫుల్ సిరీస్ గా పేరొందిన Z సిరీస్ నుండి ఈ ఫోన్ రిలీజ్ అవుతోంది. ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజ్ నుండి ఈ ఫోన్ యొక్క కలర్ ఆప్షన్స్, ప్రోసెసర్, కెమేరా సెటప్ లతో పాటుగా మరిన్ని కీలకమైన ఫీచర్లను ఇప్పటికే కంపెనీ అందించింది.
ఐకూ జెడ్9 5జి స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో 12 March 2024 తారీఖున లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ కోసం అమేజాన్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, అమేజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 6 వేలకే లభిస్తున్న 155 ఇంచ్ బ్రాండెడ్ Big Projector
ఐకూ జెడ్9 5జి స్మార్ట్ ఫోన్ యొక్క చాలా కీలకమైన స్పెక్స్ ను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఈ ఫోన్ చాలా సన్నని మరియు అందమైన డిజైన్ తో కనిపిస్తోంది. అంతేకాదు, ఐకూ ఈ ఫోన్ ను బ్రష్డ్ గ్రీన్ మరియు గ్రాఫెన్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్ లలో లాంఛ్ చేయనున్నట్లు తెలిపింది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ వుంది. ఈ సెటప్ లో SonyIMX 882 OIS సెన్సార్ ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ సెగ్మెంట్ లో ఈ సెన్సార్ తో ఇండియాలో విడుదల కాబోతున్న మొదటి ఫోన్ ఇదే అని కూడా గొప్పగా చెబుతోంది.
ఐకూ జెడ్9 5జి స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7200 5G ప్రోసెసర్ తో లాంఛ్ చేస్తోంది. ఈ ఫోన్ లో 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన AMOLED డిస్ప్లే మరియు 5000 mAh బిగ్ బ్యాటరీ ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ లాంఛ్ కంటే ముందే ఈ ఫోన్ ప్రత్యేకతలతో ఈ ఫోన్ పైన అంచనాలను పెంచేసింది.