iQOO Z9 5G: మతిపోగోట్టే డిజైన్ మరియు ఫీచర్స్ తో వస్తోంది.!

iQOO Z9 5G: మతిపోగోట్టే డిజైన్ మరియు ఫీచర్స్ తో వస్తోంది.!
HIGHLIGHTS

ఐకూ మతిపోగోట్టే డిజైన్ మరియు ఫీచర్స్ తో వస్తోంది

Z సిరీస్ నుండి ఈ ఫోన్ రిలీజ్ అవుతోంది

iQOO Z9 5G కీలకమైన ఫీచర్స్ తో కంపెనీ టీజింగ్ చేస్తోంది

iQOO Z9 5G: మతిపోగోట్టే డిజైన్ మరియు ఫీచర్స్ తో వస్తోంది. ఐకూ సక్సెస్ ఫుల్ సిరీస్ గా పేరొందిన Z సిరీస్ నుండి ఈ ఫోన్ రిలీజ్ అవుతోంది. ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజ్ నుండి ఈ ఫోన్ యొక్క కలర్ ఆప్షన్స్, ప్రోసెసర్, కెమేరా సెటప్ లతో పాటుగా మరిన్ని కీలకమైన ఫీచర్లను ఇప్పటికే కంపెనీ అందించింది.

iQOO Z9 5G: Launch

ఐకూ జెడ్9 5జి స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో 12 March 2024 తారీఖున లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ కోసం అమేజాన్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, అమేజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది.

Also Read: భారీ డిస్కౌంట్ తో 6 వేలకే లభిస్తున్న 155 ఇంచ్ బ్రాండెడ్ Big Projector

iQOO Z9 5G: Teased Specs

ఐకూ జెడ్9 5జి స్మార్ట్ ఫోన్ యొక్క చాలా కీలకమైన స్పెక్స్ ను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఈ ఫోన్ చాలా సన్నని మరియు అందమైన డిజైన్ తో కనిపిస్తోంది. అంతేకాదు, ఐకూ ఈ ఫోన్ ను బ్రష్డ్ గ్రీన్ మరియు గ్రాఫెన్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్ లలో లాంఛ్ చేయనున్నట్లు తెలిపింది.

ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ వుంది. ఈ సెటప్ లో SonyIMX 882 OIS సెన్సార్ ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ సెగ్మెంట్ లో ఈ సెన్సార్ తో ఇండియాలో విడుదల కాబోతున్న మొదటి ఫోన్ ఇదే అని కూడా గొప్పగా చెబుతోంది.

ఐకూ జెడ్9 5జి స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7200 5G ప్రోసెసర్ తో లాంఛ్ చేస్తోంది. ఈ ఫోన్ లో 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన AMOLED డిస్ప్లే మరియు 5000 mAh బిగ్ బ్యాటరీ ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్ లాంఛ్ కంటే ముందే ఈ ఫోన్ ప్రత్యేకతలతో ఈ ఫోన్ పైన అంచనాలను పెంచేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo