iQOO Z9 5G: 20 వేల బడ్జెట్ లో స్టన్నింగ్ ఫోన్ ఫీచర్స్ తో వచ్చింది.!
ఐకూ Z9 5జి ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదలయ్యింది
ఈ ఫోన్ పైన భారీ లాంఛ్ ఆఫర్లను కూడా ఐకూ ప్రకటించింది
Prime Early Access Sale మార్చి 13 మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభం అవుతుంది
iQOO Z9 5G: ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఐకూ Z9 5జి ఈరోజో ఇండియన్ మార్కెట్ లో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ 20 వేల బడ్జెట్ లో స్టన్నింగ్ ఫోన్ ఫీచర్స్ తో వచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ పైన భారీ లాంఛ్ ఆఫర్లను కూడా ఐకూ ప్రకటించింది. ఈ ఫోన్ ను గొప్ప డిజైన్, కలర్ ఆప్షన్ మరియు ఫీచర్స్ తో ఐకూ లాంఛ్ చేసింది. ఈ ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
iQOO Z9 5G: Price
ఐకూ Z9 5జి స్మార్ట్ ఫోన్ ను కంపెనీ రూ. 19,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క Prime Early Access Sale మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ఓపెన్ సేల్ మరుసటి రోజు మధ్యాహ్నం, అంటే మార్చి 14వ తేదీ మధ్యాహ్నం నుండి స్టార్ట్ అవుతుంది.
Offers
ఐకూ Z9 5జి స్మార్ట్ ఫోన్ పైన గొప్ప లాంఛ్ ఆఫర్లను కూడా ఐకూ అందించింది. స్మార్ట్ ఫోన్ ని HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ మరియు EMI ఆప్షన్ ల తో కొనుగోలు చేసే వారికి రూ. 2000 రూపాయల భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: Voter ID Card లో పేరు మరియు అడ్రెస్స్ చేంజ్ చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!
iQOO Z9 5G: Specs
ఐకో ఈ స్మార్ట్ ఫోన్ ని ఆకర్షణమైన ఫీచర్లతో విడుదల చేసింది. ఐకూ స్మార్ట్ ఫోన్ ని మీడియాటెక్ లేటెస్ట్ Dimensity 7200 5G ప్రాసెసర్ తో విడుదల చేసింది దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB | 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లతో తీసుకొచ్చింది. ఈ ఫోన్ లో 8GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ ఫీచర్ ను కూడా జత చేసింది. ఈ ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Funtouch OS 14 సాఫ్ట్ వేర్ పైన Android 14 OS తో పని చేస్తుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ లో 50 MP Sony IMX882 OIS మెయిన్ + 2 MP బొకే సెన్సార్లు కలిగిన డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమేరా వుంది. ఐకూ 9 5జి ఫోన్ OIS స్టెబిలైజేషన్ తో 4K వీడియో షూట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిజి బ్యాటరీ కూడా వుంది.
ఐకూ 9 5జి స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR వీడియో ప్లే బ్యాక్ సపోర్ట్ లను కలిగి వుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.