iQOO Z9 5G: సొగసైన డిజైన్ తో కొత్త ఫోన్ తెస్తున్న ఐకూ.!

Updated on 26-Feb-2024
HIGHLIGHTS

సొగసైన డిజైన్ తో కొత్త ఫోన్ తెస్తున్న ఐకూ

iQOO Z9 5G ఇండియన్ మార్కెట్ లో లాంఛ్ అవుతోంది

డిజైన్ ను ప్రకటిస్తూ కంపెనీ టీజర్ ఇమేజ్ లను విడుదల చేసింది

iQOO Z9 5G: ఐకూ బ్రాండ్ నుండి కొత్త ఫోన్ ఇండియన్ మార్కెట్ లో లాంఛ్ అవుతోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ డేట్ మరియు డిజైన్ ను ప్రకటిస్తూ కంపెనీ టీజర్ ఇమేజ్ లను విడుదల చేసింది. ఇప్పటికే 2024 సంవత్సరం మొదటి నుండి ఇండియన్ మార్కెట్ లో భారీ స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతుండగా, ఈ ఫోన్ ను మార్కెట్ లో గట్టి పోటీనిచ్చేలా సొగసైన డిజైన్ తీసుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఐకూ లాంఛ్ చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పైన ఒక లుక్కేద్దాం పదండి.

iQOO Z9 5G Launch Date

iQOO Z9 5G Launch Date

ఐకూ జెడ్9 5జి స్మార్ట్ ఫోన్ ను మార్చి 12వ తేదీ లాంఛ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంఛ్ డేట్ తో పాటుగా ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ను అందించింది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ కోసం అమేజాన్ ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అంతేకాదు, ఐకూ జెడ్9 5జి స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకమైన పాజ్ ద్వారా అమేజాన్ టీజింగ్ చేస్తోంది.

Also Read: Lava Blaze Curve: భారీ స్పెక్స్ తో వస్తున్న లావా అప్ కమింగ్ 5G ఫోన్.!

ఐకూ జెడ్9 5జి

ఐకూ జెడ్9 5జి స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ అందమైన గ్రీన్ మార్బుల్ కలర్ మరియు స్లీక్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ రౌండ్ కార్నర్స్ మరియు క్లీన్ డిజైన్ తో కనిపిస్తోంది మరియు పెద్ద కెమేరా బంప్ తో వస్తోంది. ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ ల వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ కనిపిస్తోంది.

ఈ ఫోన్ గురించి కంపెనీ Fully Loaded అనే హ్యాష్ ట్యాగ్ తో తేజ్ చేస్తోంది. ఈ ఫోన్ పెర్ఫార్మన్స్ గురించి కూడా టీజర్ పోస్ట్ నుండి హింట్ ఇస్తోంది. ఈ ఫోన్ కోసం కంపెనీ టీజింగ్ స్టార్ట్ చేసింది కాబట్టి, ఈ ఫోన్ లాంఛ్ నాటికి ఈ ఫోన్ యొక్క మరిన్ని వివరాలను అందిస్తుందని ఊహిస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :