iQOO Z7 స్థానంలో iQOO Z7s సైలెంట్ గా లాంచ్..ఈ రెండు ఫోన్ల మద్య వ్యత్యాసం ఏమిటంటే.!
ఐకూ ఇండియన్ మార్కెట్ లో తన Z సిరీస్ నుండి కొత్త ఫోన్ ను సైలెంట్ గా విడుదల చేసింది.
iQOO Z7s స్మార్ట్ ఫోన్ SD 695 SoC తో లాంచ్ చేసింది
ఈ రెండు ఫోన్లలో ఒక మేజర్ ఛేంజ్ వుంది
ఐకూ ఇండియన్ మార్కెట్ లో తన Z సిరీస్ నుండి కొత్త ఫోన్ ను సైలెంట్ గా విడుదల చేసింది. అదే, iQOO Z7s స్మార్ట్ ఫోన్ మరియు ఇది iQOO Z7 ను రీప్లేస్ చేస్తుందని క్లియర్ గా అర్ధం అవుతోంది. అమెజాన్ మరియు ఐకూ ఆన్లైన్ స్టోర్ నుండి ఈ ఫోన్ ఇప్పటికే సేల్ అవుతోంది. అమెజాన్ సైట్ నుండి ఈ రెండు ఫోన్లు ఒకే పేజ్ పైన లభిస్తున్నాయి. అయితే, iQOO Z7s మరియు iQOO Z7 ఫోన్ కూడా ఒకే ధరలో లిస్టింగ్ చెయ్యబడ్డాయి. కానీ, ఈ రెండు ఫోన్లలో ఒక మేజర్ ఛేంజ్ వుంది. ఈ లేటెస్ట్ ఫోన్ iQOO Z7s మరియు పాత iQOO Z7 రెండు ఫోన్ల మద్య వ్యత్యాసం మరియు ధర వివరాల పైన ఒక లుక్కేద్దామా.
iQOO Z7s vs iQOO Z7: ధర
iQOO Z7s స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (6GB + 128GB) స్టోరేజ్ తో రూ. 18,999 ధరతో వచ్చింది మరియు (8GB + 128GB) వేరియంట్ ధర రూ. 19,999. iQOO Z7 యొక్క 6GB వేరియంట్ అమెజాన్ నుండి అందుబాటులో లేదు. అయితే, ప్రస్తుతం iQOO Z7 యొక్క (8GB + 128GB) వేరియంట్ మాత్రం రూ. 19,999 ధరతో అందుబాటులో వుంది.
అయితే, ఇది ఎప్పటి వరకూ స్టాక్ లో ఉంటుందో మాత్రం కంపెనీ తెలియ చెయ్యలేదు. కానీ, కంపెనీ వెబ్సైట్ నుండి ఈ ఫోన్ యొక్క 6GB వేరియంట్ రూ. 21,999 ధరతో, 8GB స్టోరేజ్ వేరియంట్ రూ. 23,999 ధరతో లిస్టింగ్ చెయ్యబడింది.
iQOO Z7s vs iQOO Z7: స్పెక్స్
ఈ రెండు ఫోన్ల స్పెక్స్ మరియు ఫీచర్ల పరంగా, ఈ రెండు ఫోన్ల Processor మినహా ఇస్తే అన్ని ఫీచర్లు మరియు స్పెక్స్ కూడా విధంగా ఉంటాయి మరియు ఫోన్ డిజైన్ కూడా ఒకటే. వీటిలో iQOO Z7s స్మార్ట్ ఫోన్ Snapdragon 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో ఉంటే, iQOO Z7 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 920 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో ఉంటుంది. అయితే, స్నాప్ డ్రాగన్ 695 కంటే Dimensity 920 కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ మరియు స్కోర్స్ ను ఇస్తుంది.
ఇక ఇతర వివరాల్లోకి వెళితే, ఈ రెండు ఫోన్లు ఇన్ డిస్ప్లే సెన్సార్, 90Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్ కలిగిన 6.38 ఇంచ్ AMOLED డిస్ప్లే ని కలిగి ఉంటాయి. ఈ ఫోన్ లలో ఎక్స్ టెండెడ్ ర్యామ్ 3.0 సపోర్ట్ మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ రెండు ఫోన్ లలో 4K వీడియో రికార్డ్ (30fps) చెయ్యగల 64MP OISడ్యూయల్ రియర్ కెమేరా వుంది మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.
సింపుల్ గా చెప్పాలంటే, ఈ రెండు ఫోన్లు ఒకటే కానీ ప్రోసెసర్ లో మాత్రమే మార్పు ఉంటుంది.