iQOO Z7 Pro 5G ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తోంది.!

Updated on 27-Dec-2024

iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తోంది. 2023 ఆగష్టు లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఎన్నడూ చూడనంత తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు మంచి ఆఫర్ తో కూడా సేల్ అవుతోంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ సూపర్ డిజైన్ మరియు ఫీచర్ తో ఆకట్టుకుంటుంది.

iQOO Z7 Pro 5G : ఆఫర్ ధర

ఐకూ Z7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 21,999 రూపాయల ప్రైస్ తో 2023 ఆగష్టు నెలలో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ చాలా కాలం 20 వేల ధరలోనే కొనసాగింది మరియు ఎన్నడూ ధర తగ్గ లేదు. అయితే, ఈ ఐకూ పవర్ ఫుల్ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 3,000 భారీ డిస్కౌంట్ తో రూ. 18,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ ను క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 856 రూపాయల EMI వడ్డీ సేవింగ్ ఆఫర్ ను అందిస్తోంది. ఈ ఫోన్ ను ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పై నొక్కండి.

iQOO Z7 Pro 5G : ఫీచర్స్

ఐకూ Z7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ చాలా స్లిమ్ మరియు లైట్ వైట్ డిజైన్ గా ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 7200 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB ఫిజికల్ RAM మరియు 8GB Extended RAM తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.36mm మందంతో సన్నగా ఉంటుంది. ఇందులో 6.78 ఇంచ్ 3D Curved సూపర్ విజన్ స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది.

ఏ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 64 MP AURA లైట్ OIS మెయిన్ కెమెరా వుంది మరియు ముందు సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా 4K Video సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప పోర్ట్రైట్ ఫోటోలు కూడా అందిస్తుంది. ఈ ఫోన్ లో 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4600 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :