iQOO Z10x 5G launching with 6500 mah big battery and latest fast 5g chipset
iQOO Z10x 5G: ఐకూ Z10 సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఐకూ జెడ్ 10 మరియు జెడ్ 10x స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి. ఇందులో జెడ్ 10 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ముందే వెల్లడించింది. అయితే, ఇప్పుడు జెడ్ 10x స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ను కూడా ఒక్కటిగా వెల్లడిస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను భారీ 6500 mAh బ్యాటరీ మరియు లేటెస్ట్ ఫాస్ట్ 5G చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ ప్రకటించింది. ఈ ఫోన్ కోసం కంపెనీ చేస్తున్న టీజింగ్ క్యాంపైన్ ద్వారా ఈ విషయాలు వెల్లడించింది.
ఐకూ జెడ్ 10x 5జి స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 11వ తేదీన ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఇదే సిరీస్ నుంచి జెడ్ 10 స్మార్ట్ ఫోన్ ను కూడా అదే రోజు విడుదల చేస్తుంది. ఈ ఫోన్ రెండు ఫోన్స్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది. అందుకే, ఈ సిరీస్ ఫోన్స్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది.
Also Read: Realme Narzo 80x 5G ఫోన్ ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ రివీల్ చేసిన కంపెనీ.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ 5G చిప్ సెట్ Dimensity 7400 తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ ప్రకటించింది. ఇది 4nm TSMC ప్రోసెసర్ మరియు ఇది 7,28,000 కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందించే శక్తి కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 6500 mAh భారీ బ్యాటరీ సెటప్ ఉన్నట్లు కూడా కంపెనీ పేర్కొంది. ఇంట పెద్ద బ్యాటరీ ఉందంటే దానికి తగిన ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా అందిస్తుంది.
ఈ ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సరికొత్త పర్పల్ కలర్ మరియు బ్యాక్ ప్యానల్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ బడ్జెట్ సిరీస్ నుంచి వస్తున్న ఫోన్ కాబట్టి, ఈ ఫోన్ కూడా బడ్జెట్ యూజర్లను అక్కటుకునే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ నాటికి మరిన్ని ఫీచర్స్ వెల్లడయ్యే అవకాశం ఉండవచ్చు.