iQOO Z10x 5G: బడ్జెట్ ధరలో 6500 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో వచ్చింది.!

iQOO Z10x 5G: బడ్జెట్ ధరలో 6500 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో వచ్చింది.!
HIGHLIGHTS

ఐకూ Z10 సిరీస్ నుండి ఈరోజు రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది

ఐకూ జెడ్ 10x 5జి బడ్జెట్ ధరలో 6500 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ 44W ఫ్లాష్ ఛార్జ్ మరియు 6500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది

iQOO Z10x 5G; ఐకూ Z10 సిరీస్ నుండి ఈరోజు రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. వాటిలో ఈ ఐకూ జెడ్ 10x 5జి స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో 6500 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో లాంచ్ అయ్యింది. ఈ ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Z10x 5G: ప్రైస్

ఐకూ జెడ్ 10x 5జి స్మార్ట్ ఫోన్ రూ. 13,499 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క 6GB + 128GB వేరియంట్ కోసం ఈ రేటును నిర్ణయించింది. ఈ ఫోన్ యొక్క రెండవ 8GB + 128GB వేరియంట్ రూ. 14,999 రూపాయల ధరతో మరియు హై ఎండ్ 6GB + 256GB వేరియంట్ ను రూ. 16,499 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది.

ఆఫర్స్

ఈ స్మార్ట్ ఫోన్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ డిస్కౌంట్ అఫర్ తో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ కేవలం రూ. 12,499 రూపాయల ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Amazon నుంచి లభిస్తుంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

iQOO Z10x 5G: ఫీచర్స్

ఈ ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్, 8GB ఎక్స్టెండెడ్ ర్యామ్ మరియు 256GB (UFS 3.1) ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 6.72 ఇంచ్ FHD+ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1050 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఐకూ 10x 5జి స్మార్ట్ ఫోన్ అల్ట్రా మెరైన్ మరియు టైటానియం రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

iQOO Z10x 5G

ఐకూ జెడ్ 10x 5జి స్మార్ట్ ఫోన్ 50MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో AI కెమెరా ఫీచర్స్ మరియు AI సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

Also Read: మంచి డిస్కౌంట్ తో 17 వేలకే లభిస్తున్న 4K Smart Tv డీల్ గురించి తెలుసా.!

ఈ ఐకూ కొత్త ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ టెస్ట్ MIL-STD 810H సర్టిఫికేషన్ కూడా కలిగి ఉంటుంది. ఐకూ ఈ ఫోన్ ను 44W ఫ్లాష్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Funtuch OS 15 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 3 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo