iQOO Z10 complete specs leaked online
ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ iQOO Z10 స్మార్ట్ ఫోన్ పూర్తి ఫీచర్స్ ఇప్పుడు నెట్టింట్లో లీకయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ అతి పెద్ద బ్యాటరీ కలిగిన స్మార్ట్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల కావడానికి సిద్ధంగా వుంది. ఈ ఫోన్ ఏప్రిల్ నెలలో లాంచ్ కోసం సిద్ధం అవుతుండగా, ఇప్పుడు ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ బయటపెట్టారు. ఈ స్పెక్స్ మరియు ఫీచర్స్ ద్వారా ఈ ఫోన్ ఎలా ఉంటుందనే ఒక ఆలోచన వస్తుంది.
అభిషేక్ యాదవ్ తన X అకౌంట్ (ఒకప్పుడు ట్విట్టర్) నుంచి ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ వెల్లడించారు. ఈ పోస్ట్ ప్రకారం, ఐకూ 10 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ చిప్ సెట్ కి జతగా తగిన ర్యామ్ మరియు ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఉంటాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది.
ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా వివరాలు కూడా ఇందులో వెల్లడించారు. ఐకూ Z10 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP Sony LYT600 OIS ప్రధాన కెమెరా జతగా 2MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఐకూ జెడ్ 10 5జి కేవలం 7.89mm మందంతో చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ లో 7300 mAh హెవీ బ్యాటరీ మరియు ఈ బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేసే 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటాయి.
ఇక ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క లీకైన మరిన్ని ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Wi-Fi 6 మరియు లేటెస్ట్ బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఈ ఫోన్ యొక్క లీక్డ్ స్పెక్స్ గురించి మాత్రమే. ఈ ఫోన్ యొక్క బ్యాటరీ తప్పక స్పెక్స్ మరియు ఫీచర్స్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read: LG QNED Smart Tv పై అమెజాన్ సేల్ ధమాకా ఆఫర్ అందుకోండి.!
ఈ ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 11వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది. లాంచ్ కావడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ ఫోన్ ఫీచర్ త్వరలోనే కంపెనీ బయటపెడుతుంది. కాబట్టి, ఆపత్తి వరకు వీటన్నియు అంచనా ఫీచర్స్ గా మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.