iQOO Z10 5G: అతిపెద్ద బ్యాటరీ మరియు క్వాడ్ కర్వుడ్ AMOELD స్క్రీన్ తో లాంచ్ అవుతుంది.!

iQOO Z10 5G భారీ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతోంది
ఈ ఫోన్ అతిపెద్ద బ్యాటరీ మరియు క్వాడ్ కర్వుడ్ AMOELD స్క్రీన్ తో లాంచ్ అవుతుంది
ఈ స్మార్ట్ ఫోన్ టీజింగ్ ఇప్పుడు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది
iQOO Z10 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ నుంచి ఈ సారి భారీ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతోంది. అదే ఐకూ జెడ్ 10 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ అతిపెద్ద బ్యాటరీ మరియు క్వాడ్ కర్వుడ్ AMOELD స్క్రీన్ తో లాంచ్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ గురించి కంపెనీ వెల్లడించిన టీజర్ స్పెక్స్ మరియు ఫోన్ డిజైన్ ద్వారా ఈ ఫోన్ భారీ ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ అయ్యింది. అంతేకాదు, ఐకూ Z సిరీస్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన స్మార్ట్ ఫోన్స్ బడ్జెట్ మరియు మిడ్ రేంజ్ ధరలో మాత్రమే వచ్చాయి కాబట్టి, ఈ ఫోన్ ప్రైస్ కూడా బడ్జెట్ లేదా మిడ్ రేంజ్ లో ఉండే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే, ఈ స్మార్ట్ ఫోన్ టీజింగ్ ఇప్పుడు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.
iQOO Z10 5G: లాంచ్
ఈ ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 11వ తేదీన లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం మేజర్ సేల్ పార్ట్నర్ గా అమెజాన్ అమెజాన్ ఇండియా వ్యవహరిస్తోంది. అందుకే, ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించిన మరి టీజింగ్ చేస్తోంది. ఈ టీజీ నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా వెల్లడించింది.
iQOO Z10 5G: ఫీచర్స్
ఇప్పటివరకు వివో ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన వివరాలు బయటపెట్టింది. ఇందులో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్, స్క్రీన్, బ్యాటరీ మరియు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ 7300 mAh అతిభారీ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ అతిపెద్ద బ్యాటరీ కలిగి ఉన్నా కూడా ఈ ఫోన్ కేవలం 7.89mm మందంతో చాలా స్లీక్ ఉంటుందట.
ఐకూ జెడ్ 10 5జి స్మార్ట్ ఫోన్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అవుతుందని ఐకూ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ స్క్రీన్ 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుందని కూడా కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లో పైన సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా మరియు వెనుక డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50MP ప్రధాన కెమెరా మరియు రింగ్ ఫ్లాష్ లైట్ ఉంటాయి.
Also Read: Jio Down: జియో నెట్ వర్క్ మరియు ఫైబర్ పనిచేయడం లేదని గగ్గోలు పెడుతున్న యూజర్లు.!
ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ స్టెల్లార్ బ్లాక్ మరియు గ్లేసియర్ సిల్వర్ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో విడుదల చేసే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.