iQOO Neo 9 Pro: 35 వేల బడ్జెట్ లో మోస్ట్ పవర్ ఫుల్ ఫోన్ ఫస్ట్ సేల్.!
ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం మొదలవుతుంది
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ టోన్ వేగాన్ లెథర్ బ్యాక్ డిజైన్ తో గొప్ప లుక్స్ తో వస్తుంది
ఈ ఫోన్ మొదటి సేల్ నుండి మంచి డీల్స్ మరియు ఆఫర్లతో కూడా లభిస్తుంది
iQOO Neo 9 Pro: ఐకూ ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం మొదలవుతుంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ టోన్ వేగాన్ లెథర్ బ్యాక్ డిజైన్ తో గొప్ప లుక్స్ తో వస్తుంది. ఈ ఫోన్ లో మొదటి సేల్ నుండి మంచి డీల్స్ మరియు ఆఫర్లతో కూడా లభిస్తుంది. అందుకే, రేపు మొదటిసారి సేల్ కి రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర,స్ స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
iQOO Neo 9 Pro Price & Offers
ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క 8GB RAM + 256GB వేరియంట్ రూ. 36,999 ధరతో ఉండగా, 12GB RAM + 256GB వేరియంట్ రూ. 38,999 రూపాయల ధరతో వచ్చింది. ఈ ఫోన్ తో పాటుగా మంచి లాంఛ్ ఆఫర్లను కూడా ఐకూ అందించింది.
ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ పైన మెమోరీ అప్గ్రేడ్ ఆఫర్ తో రూ. 1,000 రూపాయలు మరియు రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ ను కొనే యూజర్లకు ఈ రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ ఐకూ కొత్త ఫోన్ పైన 6 నెలల అధనపు వారెంటీ ఆఫర్ ను కూడా అందించింది.
Also Read: Redmi A3 First Sale: రెడ్ మి బడ్జెట్ స్టైలిష్ ఫోన్ ఫస్ట్ సేల్.!
ఐకూ నియో 9 ప్రో స్పెక్స్
ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ లో Snapdragon 8 Gen 2 ప్రోసెసర్ జతగా Supercomputing Chip Q1 చిప్ సెట్ వుంది. ఈ ఫోన్ లో అందించిన 12GB మరియు 12GB Extended RAM ఫీచర్ తో ఫోన్ చాలా వేగంగా పని చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది. ఈ ఫోన్ 120W బ్లేజింగ్ ఫాస్ట్ చారి సపోర్ట్ కలిగిన 5160 mAh బిగ్ బ్యాటరీతో కూడా అందించింది.
ఈ ఫోన్ లో మరింత ప్రాముఖ్యత కలిగిన ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో అందించిన డిస్ప్లే మరియు కెమేరాల గురించి చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ లో వెనుక 8K video సపోర్ట్ కలిగిన 50MP (Sony IMX920) మెయిన్ సెన్సార్ + 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది.
అలాగే, ఈ ఫోన్ లో6.78 పరిమాణంతో 144 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LTPO AMOLED డిస్ప్లే వుంది. ఇది 1.5K రిజల్యూషన్ మరియు 2160Hz PWM డిమ్మింగ్ తో గొప్ప విజువల్స్ ను అందించ గలదు.
ఈ ఫోన్ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే, 2024 ఫిబ్రవరి వరకూ 35 వేల రూపాయల ధరలో విడుదలైన ఫోన్లలో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్క్ అందించ గల ఫోన్ గా నిలుస్తుంది.