అమెజాన్ బ్లాక్ బాస్టర్ వాల్యూ డేస్ సేల్ నుండి iQOO Neo 7 5G పైన బిగ్ డీల్స్.!

Updated on 25-Apr-2023
HIGHLIGHTS

ఈరోజు నుండి బ్లాక్ బాస్టర్ వాల్యూ డేస్ సేల్ మొదలయ్యింది

ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి

ఈ సేల్ నుండి లేటెస్ట్ iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ కూడా మంచి అఫర్ తో లభిస్తోంది

అమెజాన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ పైన ఈరోజు నుండి బ్లాక్ బాస్టర్ వాల్యూ డేస్ సేల్ మొదలయ్యింది. ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి మరియు మరికొన్ని ప్రోడక్ట్స్ భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తున్నాయి. ఈ సేల్ నుండి లేటెస్ట్ iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ కూడా మంచి అఫర్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ ఆఫర్ల చేస్తున్న డీల్స్ మరియు ఫోన్ వివరాల పైన ఒక లుక్కేద్దాం పదండి. 

iQOO Neo 7 5G: ఆఫర్స్

iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ ఇటీవలే ఇండియాలో విడుదలయ్యింది మరియు 30 వేల ధరలో ఆకట్టుకునే ప్రత్యేకతలతో వచ్చింది. అమెజాన్ సేల్ నుండి ఈ ఫోన్ యొక్క (8GB+128GB) వేరియంట్ రూ.29,999 ధరతో, (12GB+256GB) వేరియంట్ రూ.33,999 ధరతో లభిస్తున్నాయి. ఇదేంటి ఇవి రెగ్యులర్ ధరలే కదా ఇందులో అఫర్ ఏముంది అనుకోకండి. ఈ ఫోన్ లను HDFC మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారు 2,000 రూపాయల డిస్కౌంట్ పొందుతారు. SBI క్రెడిట్ కార్డ్ EMI తో కొనేవారికి కూడా 1,000 డిస్కౌంట్ వెంటనే లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను డిస్కౌంట్ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.  Buy From Here

iQOO Neo 7 5G: ప్రధాన ఆకర్షణలు

ఈ iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ పెద్ద 6. 78 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. ఈ ఫోన్ లో OIS సపోర్ట్ కలిగిన 64MP డ్యూయల్ కెమెరా సిస్టమ్ వుంది. అలాగే, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ LPDDR5 RAM, Dimensity 8200 ఫాస్ట్ 5G చిప్ సెట్ వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్ కలిగివుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :