iQOO Neo 10R First Sale: ఐకూ లేటెస్ట్ బడ్జెట్ పవర్ ఫుల్ ఫోన్ ఫస్ట్ సేల్ కి వచ్చేసింది.!

Updated on 18-Mar-2025
HIGHLIGHTS

ఐకూ లేటెస్ట్ బడ్జెట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్

iQOO Neo 10R First Sale మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది

ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ అందుకోవచ్చు

iQOO Neo 10R First Sale: ఐకూ లేటెస్ట్ బడ్జెట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఫస్ట్ సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ పై గొప్ప డీల్స్ మరియు ఆఫర్లు కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ ను 25 వేల బడ్జెట్ సెగ్మెంట్ లో పవర్ ఫుల్ ఫీచర్స్ తో రీసెంట్ గా లాంచ్ చేసింది మరియు ఇప్పుడు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది.

iQOO Neo 10R First Sale:

ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ 8GB + 128GB బేసిక్ వేరియంట్ ను రూ. 26,999 ధరతో లాంచ్ చేసింది. అలాగే, 8GB + 256GB వేరియంట్ ను రూ. 28,999 మరియు 12GB + 256GB వేరియంట్ ను రూ. 30,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై రెండు గొప్ప లాంచ్ ఆఫర్లు కూడా అందించింది. ఈ ఫోన్ ను SBI, HDFC మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 2,000 డిస్కౌంట్ లభిస్తుంది. లేదా ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను అందుకోవచ్చు.

అంటే, ఈ రెండు ఆఫర్స్ లో ఒకదానిని కొనుగోలుదారులు అందుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read: భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ 40 ఇంచ్ FHD Smart Tv డీల్స్.!

iQOO Neo 10R : ఫీచర్స్

ఈ ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 1.7Mn+ AnTuTu స్కోర్ అందించే 4nm TSMC చిప్ సెట్ Snapdragon 8s Gen 3 చిప్ సెట్, 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి వుంటుంది. ఈ ఫోన్ కలిగిన స్క్రీన్ HDR 10+, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1.5K రిజల్యూషన్ కలిగి ఉంటుంది.

iQOO Neo 10R

ఈ ఫోన్ లో 50MP మెయిన్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్లు కలిగిన డ్యూయల్ రియర్ మరియు 32ఎంపు సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6400 mAh హెవీ బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ AI సపోర్ట్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :