iQOO Neo 10 Series కొత్త ఆరంజ్ కలర్ తో లాంచ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా టీజర్ విడుదల చేసింది. ఈ ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ రానున్న వారాల్లో లాంచ్ చేయనున్నట్లు టీజింగ్ మొదలు పెట్టింది. ఐకూ 9 సిరీస్ యొక్క అప్గ్రేడ్ వెర్షన్ గా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తుందని చెబుతున్నారు. అయితే, ఈ అఫీషియల్ లాంచ్ టీజింగ్ చేస్తోంది చైనా మార్కెట్ గురించి అనుకోండి.
ఐకూ నియో 10 సిరీస్ ను కొత్త ఆరంజ్ కలర్ లతో కూడా లాంచ్ చేస్తున్నట్లు ఐకూ తెలిపింది. ఈ అప్ కమింగ్ సిరీస్ ను ముందుగా చైనా మార్కెట్ లో విడుదల చేస్తుంది మరియు తర్వాత గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ఇప్పటికే vivo ఆన్ లైన్ స్టోర్ మరియు JD, Tmall వంటి సోర్స్ ల నుంచి చానా మార్కెట్ లో ప్రీ రిజర్వేషన్ కోసం అందుబాటులోకి వచ్చింది.
ఐకూ నియో 10 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను గొప్ప ఫీచర్స్ తో తీసుకువస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం కంపెనీ అందించిన టీజర్స్ ద్వారా ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ బయటకు వచ్చాయి. ఐకూ ఈ ఫోన్ ను ఆరంజ్ మరియు గ్రే డ్యూయల్ టోన్ ఫినిష్ తో అందిస్తుంది.
ఈ ఐకూ ప్రీమియం సిరీస్ ఫోన్స్ 8T LTPO స్క్రీన్ తో లాంచ్ కావచ్చు. ఈ స్క్రీన్ అధిక రిఫ్రెష్ రేట్ మరియు అధిక బ్రైట్నెస్ తో మరింత స్మూత్ పెర్ఫార్మెన్స్ అందించే అవకాశం ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ Dimensity 9400 తో రావచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: WhatsApp New: యూజర్ అనుకూలత కోసం కొత్త message Drafts ఫీచర్ తెచ్చింది.!
ఈ ఫోన్ లో గోపా కెమెరా సెటప్ కూడా వుంటుందట. ఈ ఫోన్ లో వెనుక 50MP Sony IMX921 ప్రధాన సెన్సార్ మరియు 50MP JN1 సెన్సార్ తో ఫోన్ కెమెరా ఉండవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ లో పెద్ద 6100 mAh బ్యాటరీని 120W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించే అవకాశం ఉంటుంది.