iQOO Neo 10 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ కావడానికి ముందే రికార్డు సృష్టించింది. రీసెంట్ గా ఐక్యూర్ 13 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు చైనా మార్కెట్ లో ఐకూ నియో 10 సిరీస్ ను కూడా లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సిరీస్ నుంచి లాంచ్ చేయబోతున్నట్లు చెబుతున్న నియో 10 ప్రో స్మార్ట్ ఫోన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రికార్డు స్థాయి AnTuTu స్కోర్ ను నమోదు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఐకూ నియో 10 మరియు నియో 10 ప్రో స్మార్ట్ ఫోన్ లను నవంబర్ 29న చైనాలో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ ప్రకటించింది. ఈ ఫోన్ కోసం కంపెనీ చేస్తున్న టీజింగ్ లో భాగంగా కొత్త అప్డేట్ విడుదల చేసింది. ఈ అప్డేట్ ద్వారా ఈ ఫోన్ రికార్డు స్థాయి AnTuTu స్కోర్ అర్ధం అవుతుంది. కంపెనీ అధికారకంగా విడుదల చేసిన టీజర్ పేజ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.
ఐకూ నియో 10 ప్రో స్మార్ట్ ఫోన్ AnTuTu పై 32,04,156 భారీ స్కోర్ ను అచీవ్ చేసినట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకూ ఈ స్కోర్ ను ఏ ఫోన్ కూడా నమోదు చేయలేదు. అంటే, ఈ ఫోన్ అత్యంత గొప్ప AnTuTu స్కోర్ కలిగిన ఫోన్ గా రికార్డ్ నెలకొల్పుతుంది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో ఈ విషయాన్ని కంపెనీ అనౌన్స్ చేసే అవకాశం ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: 25 వేల బడ్జెట్ లో లేటెస్ట్ 50 ఇంచ్ 4K Smart Tv కోసం చూస్తున్నారా.!
ఐకూ నియో 10 ప్రో స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 9400 చిప్స్ సెట్ మరియు LPDDR5X అల్ట్రా ర్యామ్ మరియు UFS 4.1 ఫాస్ట్ స్టోరేజ్ ల కలియికతో అందిస్తుంది. ఈ ఫీచర్స్ కారణంగానే ఈ ఫోన్ ఇంట గొప్ప స్కోర్ నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 1.5K రిజల్యూషన్ కలిగిన 8T LTPO స్క్రీన్ 144hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో Sony IMX921 ప్రీమియం కెమెరా సెటప్ మరియు డిస్ప్లే కోసం ప్రత్యేకమైన Q2 చిప్ సెట్ ఉన్నట్లు కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ అన్ని ప్రత్యేకతలను కలిగి ఉన్నా కేవలం 7.99mm మందంతో చాలా సన్నగా ఉంటుందని కూడా ఐకూ అనౌన్స్ చేసింది.
ఈ ఫోన్ మరో రెండు రోజుల్లో చైనా మార్కెట్ లో లాంచ్ అవుతుంది.