7300 mAh భారీ బ్యాటరీతో iQOO Z10 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది.!

ఎన్నడూ చూడని విధంగా 7300 mAh భారీ బ్యాటరీతో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు ఐకూ అనౌన్స్ చేసింది
iQOO Z10 కీలకమైన ఫీచర్స్ కూడా ఐకూ వెల్లడించడం మొదలు పెట్టింది
ఐకూ Z10 స్మార్ట్ ఫోన్ వచ్చే నెల రెండో వారంలో లాంచ్ అవుతుంది
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఐకూ స్మార్ట్ ఫోన్ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 7300 mAh భారీ బ్యాటరీతో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అదే, iQOO Z10 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా ఐకూ వెల్లడించడం మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ బిగ్ బ్యాటరీ ఐకూ స్మార్ట్ ఫోన్ వివరాలు ఏమిటో చూద్దామా.
iQOO Z10 : లాంచ్
ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఐకూ Z10 స్మార్ట్ ఫోన్ వచ్చే నెల రెండో వారంలో లాంచ్ అవుతుంది. ఇక ఖచ్చితమైన డేట్ గురించి చూస్తే, ఈ ఫోన్ ఏప్రిల్ 11వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ ఫోన్ వివరాలు మరియు లాంచ్ డేట్ తో కూడిన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి ని అందించి టీజింగ్ చేస్తోంది.
iQOO Z10 : ఫీచర్స్
ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఐకూ జెడ్ 10 స్మార్ట్ ఫోన్ అతిపెద్ద బ్యాటరీతో లాంచ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 7300 mAh భారీ బ్యాటరీతో లాంచ్ అవుతుందని ఐకూ గొప్పగా చెబుతోంది. వాస్తవానికి, ఇప్పటికి వరకు 5000 mAh, 6000 mAh మరియు 6500 mAh బ్యాటరీ వరకు స్మార్ట్ ఫోన్ లలో అందించడం మనం చూశాం. అయితే, ఇప్పుడు ఐకూ ఏకంగా 7300 mAh హెవీ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది.
మరి ఇంట పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ లావుగా ఉంటుందేమో అనే డవుట్ అందిరికి వస్తుంది. అయితే, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ను చూస్తుంటే మాత్రం అలా అనిపించడం లేదు. ఎందుకంటే, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లో ఈ ఫోన్ ప్రస్తుతం వస్తున్న రెగ్యులర్ ఫోన్స్ కంటే కొంచెం మందంగా ఉండే అవకాశం మాత్రమే కనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ చేతిలోకి తీసుకుంటే ఖచ్చితమైన అవగాహన వస్తుంది.
Also Read: Sony BRAVIA 3 Smart Tv పై భారీ తగ్గింపు ప్రకటించిన అమెజాన్.!
ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉన్నట్లు కూడా ఇమేజ్ లో కనిపిస్తోంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ లో డ్యూయల్ స్పీకర్లు మరియు ఔఞ్చ హోల్ సెల్ఫీ కెమెరా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి, ఈ ఫోన్ యొక్క ఈ వివరాలు మాత్రమే బయటకు వచ్చాయి. త్వరలోనే ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ కూడా బయటకు వెల్లడించే అవకాశం ఉంది.