iQOO Neo9 Pro: విడుదలకు ముందే Pre-Book మరియు ఆఫర్లు అనౌన్స్ చేసిన కంపెనీ.!
ఐకూ నియో9 ప్రో ఇండియా లాంచ్ గురించి కంపెనీ చాలా కాలంగా టీజింగ్ చేస్తోంది
ఫిబ్రవరి 8వ తేది మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రీ-బుకింగ్ మొదలు
కేవలం రూ. 1,000 రూపాయలు ముందస్తుగా చెల్లించి ఈ ఫోన్ ను ప్రీ బుక్ చేసుకోవచ్చు
iQOO Neo9 Pro: ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఐకూ నియో9 ప్రో ఇండియా లాంచ్ గురించి కంపెనీ చాలా కాలంగా టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను ఫిబ్రవరి 22న ఇండియాలో విడుదల చేయనున్నట్లు డేట్ అనౌన్స్ చేసింది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ ఆఫర్స్ మరియు Pre-Book డేట్ ను కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ఫిబ్రవరి 22న లాంచ్ అవ్వనుండగా, ఫిబ్రవరి 8వ తేది మధ్యాహ్నం 12 గంటల నుండే ఈ ఫోన్ ను ప్రీ-బుకింగ్ మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది.
iQOO Neo9 Pro Pre-Book
ఐకూ నియో9 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రీ బుకింగ్ ఫిబ్రవరి 8వ తేది మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది. కేవలం రూ. 1,000 రూపాయలు ముందస్తుగా చెల్లించి ఈ ఫోన్ ను ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఐకూ నియో9 ప్రో కోసం ప్రీ బుక్ ఆఫర్స్ ను కూడా ఐకూ ప్రకటించింది.
ఐకూ నియో9 ప్రో ప్రీ బుక్ చేసుకునే కస్టమర్లకు రూ. 1,000 అధనపు తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటుగా 2 సంవత్సరాల వారెంటీ మరియు రూ. 2,499 రూపాయల విలువైన ఐకూ కూలింగ్ ప్యాడ్ ను కూడా ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ఇది మాత్రమే కాదు, లాంచ్ రోజున ప్రకటించే ఎక్స్ క్లూజివ్ ఆఫర్లను కూడా పొందవచ్చని అనౌన్స్ చేసింది.
Also Read : QLED Smart Tv: డిస్కౌంట్ ఆఫర్ తో 20 వేలకే బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!
ఐకూ నియో9 ప్రో టీజ్డ్ స్పెక్స్
ఐకూ నియో9 ప్రో స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Gen 2 ఫాస్ట్ ప్రోసెసర్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను 1.7 mn+ AnTuTu స్కోర్ ను తో చూపిస్తోంది ఐకూ. ఈ ఫోన్ ను కొత్త డ్యూయల్ టోన్ లెథర్ బ్యాక్ డిజైన్ తో తీసుకు వస్తోంది మరియు ఫోన్ చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక 50MP SonyIMX920 మెయిన్ సెన్సార్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ గల డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది.
ఈ ఫోన్ ను 8GB RAM + 128GB స్టోరేజ్ మరియు 12GB RAM + 128GB RAM వేరియంట్ ఆప్షన్ లతో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ లో పెద్ద 5160mAh బ్యాటరీ అత్యంత వేగవంతమైన 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వుంది. ఈ ఫోన్ లో సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1 తో 144 FPS గేమ్ ఫ్రెమ్ రేట్ మరియు 900 P గేమ్ సూపర్ రిజల్యూషన్ ను అందిస్తుందని ఐకూ తెలిపింది.