ఐకూ ప్రీమియం స్మార్ట్ ఫోన్లను ముందెన్నడూ చూడనంత తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.!

Updated on 06-Apr-2023
HIGHLIGHTS

iQOO Quest Days సేల్ నుండి iQOO 9 Series ఫోన్ల పైన భారీ డిస్కౌంట్

ఐకూ ప్రీమియం స్మార్ట్ ఫోన్లను ముందెన్నడూ చూడనంత తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు

iQOO Quest Days సేల్ నుండి iQOO 9 Series ఫోన్ల పైన భారీ డిస్కౌంట్

iQOO Quest Days సేల్ నుండి iQOO 9 Series ఫోన్ల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సేల్ ఆఫర్ల ద్వారా ఐకూ ప్రీమియం స్మార్ట్ ఫోన్లను ముందెన్నడూ చూడనంత తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. అంటే, కొత్త ఫోన్లను మంచి లాభదాయకమైన ఆఫర్లతో పొందవచ్చన్న మాట. మరి ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ల ఆపిన అందించిన డీల్స్ మరియు ఆఫర్ల వివరాలేమిటో తెలుసుకుందాం పదండి.   

iQOO 9 SE: ధర మరియు ఆఫర్లు

iQOO 9 SE స్మార్ట్ ఫోన్ ఈ సిరీస్ లో లభించే తక్కువ ధర ఫోన్ మరియు ఈ ఫోన్ అమెజాన్ నుండి iQOO Quest Days సేల్ నుండి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ (8GB + 128GB) వేరియంట్ ధర రూ.33,990 ధరతో లాంచ్ కాగా ఇప్పుడు అమెజాన్ నుండి 3,000 రూపాయల డిస్కౌంట్ తో రూ.30,990 రూపాయలకే లభిస్తోంది. అంతేకాదు, ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి రూ.3,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here 

iQOO 9: ధర మరియు ఆఫర్లు

iQOO 9 స్మార్ట్ ఫోన్ ఈ సిరీస్ లో లభించే మిడ్ రేంజ్ ధర ఫోన్. ఈ ఫోన్ (8GB + 128GB) వేరియంట్ ధర రూ.42,990 కాగా iQOO Quest Days సేల్ నుండి 5,000 రూపాయల డిస్కౌంట్ తో రూ.37,990 ధరకే లభిస్తోంది. Buy From Here 

iQOO 9 Pro: ధర మరియు ఆఫర్లు

iQOO 9 Pro స్మార్ట్ ఫోన్ ఈ సిరీస్ లో హై ఎండ్ స్మార్ట్ ఫోన్ మరియు భారీ ఫీచర్లతో కూడా ఉంటుంది. ఈ ఫోన్ అమెజాన్ నుండి iQOO Quest Days సేల్ తక్కువ ధరకే లభిస్తోంది. రూ.64,990 ధరలో వచ్చిన ఈ ఫోన్ ఈ సేల్ నుండి రూ.10,000 డిస్కౌంట్ తో రూ.54,990 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 5,000 రూపాయల అదనపు డిస్కౌంట్ అఫర్ కూడా అందించింది. అంటే, అన్ని ఆఫర్లతో ఈ ఫోన్ ను రూ.49,990 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.  Buy From Here       

iQOO 9: స్పెక్స్

iQOO 9 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్  కలిగిన 6.56-అంగుళాల 10-బిట్ AMOLED ప్యానెల్‌ను ఈ ఫోన్ కలిగివుంది. ఇది HDR10+  కి సపోర్ట్ చేస్తుంది మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా LPDDR5 + UFS 3.1కాన్ఫిగరేషన్ కలిగిన 12GB ర్యామ్ మరియు స్టోరేజ్ 256 అప్షన్ లను అందిస్తుంది.ఈ ఫోన్ Android 12 ఆధారితమైన FunTouchOs 12  స్కిన్ పైన నడుస్తుంది.

కెమెరా విభాగంలో, 13MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 13MP 50mm ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ లెన్స్‌తో పాటు 48MP IMX 598 సెన్సార్‌తో గల రియర్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో 16MP లెన్స్‌ ఉంటుంది. ఇందులో, Gimbal స్టెబిలైజేషన్ సెటప్ ను కూడా అందించింది. ఈ ఫోన్ 4,350mAh బ్యాటరీని ప్యాక్‌ చేస్తుంది మరియు ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :