iQOO 13 స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Elite చిప్ సెట్ తో లాంచ్ చేసింది.!
iQOO 13 స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Elite చిప్ సెట్ తో లాంచ్ చేసింది
ఈ ఫోన్ ను 16GB ర్యామ్ మరియు 1TB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఐకూ విడుదల చేసింది
ఈ ఫోన్ వేగవంతమైన అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి వుంది
iQOO 13 స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Elite చిప్ సెట్ తో లాంచ్ చేసింది. క్వాల్కమ్ సరికొత్తగా విడుదల చేసిన వేగవంతమైన ప్రొసెసర్ తో ఐకూ కొత్త ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను 16GB ర్యామ్ మరియు 1TB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఐకూ విడుదల చేసింది. ఈ ఫోన్ చైనా ప్రస్తుతం చైనా మార్కెట్ లో విడుదల చేసింది మరియు ఈ ఫోన్ త్వరలోనే ఇండియాలో కూడా విడుదల చేయనున్నట్లు కూడా ఐకూ ఇప్పటికే టీజింగ్ మొదలు పెట్టింది.
iQOO 13 : (చైనా) ఫీచర్స్
ఐకూ ఈ స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Elite తో విడుదల చేసింది. ఇది 3nm చిప్ సెట్ మరియు 16GB LPDDR5X ర్యామ్ మరియు 1TB (UFS 4.0) ఇంటర్నల్ స్టోరేజ్ తో జతగా వస్తుంది. ఈ ఫోన్ లో 6.82 ఇంచ్ Support HDR AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 2K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు P3 color gamut ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి వుంది.
ఈ ఫోన్ లో వెనుక లో వెనుక 50MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్ మరియు 50MP టెలిఫోటో కెమెరా లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఐకూ కొత్త ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 6150mAh థర్డ్ జనరేషన్ సిలికాన్ బిగ్ బ్యాటరీని 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Also Read: Flipkart Last Minute Deal: భారీ డిస్కౌంట్ తో 18 వేలకే Dolby Vision స్మార్ట్ టీవీ అందుకోండి.!
iQOO 13 : (చైనా) ప్రైస్
ఐకూ ఈ ఫోన్ ను మొత్తం 5 వేరియంట్లలో 4 కలర్ ఆప్షన్ లలో అందించింది. ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (12GB + 256GB) ను RMB 3999 (సుమారు రూ. 47,200) ధరతో అందించింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ (16GB + 1TB) వేరియంట్ ను RMB 5199 (సుమారు రూ. 61,500) ధరతో అందించింది. ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది.