iQOO 13 Launch: 2K స్క్రీన్ మరియు డ్యూయల్ Chipset తో ఇండియా లాంచ్ కన్ఫర్మ్.!

Updated on 06-Nov-2024
HIGHLIGHTS

ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కొత్త టీజర్ ను విడుదల చేసింది

iQOO 13 Launch టీజర్ నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలు కూడా బయటపెట్టింది

ఐకూ 13 స్మార్ట్ ఫోన్ ను ఇదే నెలలో లాంచ్ చేస్తుందని ఐకూ ప్రకటించింది

iQOO 13 Launch: ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కొత్త టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలు కూడా బయటపెట్టింది. ముందుగా చైనా మార్కెట్ లో విడుదల చేసిన ఈ ఫోన్ ను ఇప్పుడు భారత మార్కెట్లో కూడా విడుదల చేస్తోంది. ఈ ఫోన్ కొత్త టీజర్ ద్వారా బయటకు వచ్చిన కొత్త వివరాలు మరియు ఈ ఫోన్ కీలకమైన స్పెక్స్ తెలుసుకుందామా.

iQOO 13 Launch:

ఐకూ 13 స్మార్ట్ ఫోన్ ను ఇదే నెలలో లాంచ్ చేస్తుందని ఐకూ ప్రకటించింది. అంటే, ఈ నెల చివరి నాటికి లేదా అంత కంటే ముందు ఈ ఫోన్ ను లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. వాస్తవానికి, ఈ ఫోన్ ను చైనా మార్కెట్ లో ముందే విడుదల చేసింది. ఈ ఫోన్ గొప్ప డిజైన్ తో లాంచ్ చేస్తోంది మరియు ఇందులో BMW స్పెషల్ ఎడిషన్ కూడా ఉంటుంది.

iQOO 13 : ఫీచర్స్

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ను సేల్ పార్ట్నర్ గా ఎంచుకుంది. అందుకే, అమెజాన్ ప్లాట్ ఫామ్ పై ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి ని అందించింది. ఈ టీజింగ్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ఒక్కొక్కటిగా వెల్లడిస్తోంది.

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Elite సూపర్ ఫాస్ట్ చిప్ సెట్ మరియు జతగా iQOO సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ ను కూడా కలిగి ఉంటుందని కన్ఫర్మ్ చేసింది. ఈ ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 2K రిజల్యూషన్ కలిగిన LTPO AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుందని కూడా ఐకూ కన్ఫర్మ్ చేసింది.

Also Read: 50 inch Smart Tv Deal: 24 వేలకే స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా మరియు కెమెరా చూట్టు ఉన్న పెద్ద రింగ్ లైట్ (Monster helo Lite) తో ఉంటుంది. ఈ టైప్ C పోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు గొప్ప డిజైన్ ను కలిగి ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ అప్ కమింగ్ ఐకూ ఫోన్ యొక్క మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళి కలుద్దాం.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :