iQOO 13 స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Elite చిప్ సెట్ తో అనౌన్స్.. లాంచ్ ఎప్పుడంటే.!
iQOO 13 స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన ఐకూ
Snapdragon 8 Elite చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ అనౌన్స్ చేసింది
iQOO 13 ఫోన్ లాంచ్ తో కంపెనీ టీజింగ్ చేపట్టింది
iQOO 13 స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Elite చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ అనౌన్స్ చేసింది. ఈ ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించి అందిరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, ఈ ఫోన్ లాంచ్ తో కంపెనీ టీజింగ్ చేపట్టింది. ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ విశేషాలు ఏమిటో చూద్దామా.
iQOO 13 : లాంచ్
ఐకూ 13 స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేస్తుందని ఐకూ తెలిపింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. కానీ కంపెనీ యోక్క అధికారిక X అకౌంట్ నుంచి ఈ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ మాత్రం మొదలు పెట్టింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ను సేల్ పార్ట్నర్ గా ఎంచుకుంది మరియు ఈ విషయాన్ని కూడా వెల్లడించింది.
ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ గా విడుదల చేసిన స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ తో తీసుకు వస్తున్నట్లు తెలిపింది. ఈ చిప్ సెట్ లేటెస్ట్ గా విడుదల అయ్యింది మరియు ఈ చిప్ సెట్ గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుందని క్వాల్కమ్ ప్రకటించింది. ఇది 3nm ఫ్యాబ్రికేషన్ చిప్ సెట్ మరియు గరిష్టంగా 4.32 GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఈ లేటెస్ట్ ప్రోసెసర్ Qualcomm Oryon CPU మరియు డ్యూయల్ కోర్ AI ప్రోసెసర్.
ఈ చిప్ సెట్ Snapdragon X80 5G మోడెమ్ తో గరిష్టంగా 10Gbps డౌన్ లోడ్ స్పీడ్ ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ చిప్ సెట్ AI ISP తో గొప్ప ఫోటోలు వీడియోలతో పాటు అద్భుతమైన గేమింగ్ ఫీచర్స్ ను కూడా అందిస్తుంది.
Also Read: ఇంటర్నేషనల్ Scam Calls ను బ్లాక్ చేయడానికి కొత్త సిస్టం తెచ్చిన ప్రభుత్వం.!
ఇప్పటివరకు మనం చిప్ సెట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ చిప్ సెట్ కలిగిన ఫీచర్స్ ప్రకారం ఈ చిప్ సెట్ తో రాబోతున్న ఐకూ 13 ఫోన్ గొప్ప కెమెరా సిస్టం, ర్యామ్, హెవీ ఇంటర్నల్ మెమరీ, పవర్ ఫుల్ డిస్ప్లే మరియు మరిన్ని ఫీచర్స్ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.