iQOO 13 Launch డేట్ ను ఐకూ ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ఇదే నెలలో లాంచ్ చేస్తుందని ముందుగా అందురూ అనుకున్నారు. అయితే, ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ నెలలో లాంచ్ చేస్తున్నట్లు డేట్ కన్ఫర్మ్ చేసింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కోసం దాదాపుగా నెల రోజుల ముందు నుంచే టీజింగ్ మొదలు పెట్టింది ఐకూ. ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ ఎలా ఉన్నాయో ముందే తెలుసుకోండి.
ఐకూ 13 5జి స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ను ఒక్కొక్కటిగా ఐకూ విడుదల చేయడం మొదలు పెట్టింది.
ఐకూ కీలకమైన ఫీచర్స్ లో ముఖ్యమైనది ఈ ఫోన్ లో అందించిన చిప్ సెట్. ఐకూ ఈ ఫోన్ ను Snapdragon 8 Elite చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిప్ సెట్ 4.3 GHz క్లాక్ స్పీడ్ తో చాలా వేగవంతంగా ఉంటుంది. ఈ ప్రోసెసర్ 30M కు పైగా AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా ఐకూ సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ కూడా ఉంటుంది.
ఈ ఐకూ ఫోన్ 2K రిజల్యూషన్ కలిగిన LTPO AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుందని కూడా ఐకూ ప్రకటించింది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు అల్ట్రా ఐ కేర్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది.
Also Read: బడ్జెట్ ధరలో Dolby Soundbar కోసం వెతుకుతున్నారా.!
ఈ కెమెరా సెటప్ చుట్టూ పెద్ద LED లైట్ వుంది. ఈ లైట్ ను Monster helo Lite గా కంపెనీ పిలుస్తోంది. ఈ ఫోన్ టైప్ C పోర్ట్ మరియు డయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ ను త్వరలోనే ప్రకటిస్తుందని ఐకూ తెలిపింది.