Monster Halo Lite తో లాంచ్ అవుతున్న iQOO 13 స్మార్ట్ ఫోన్.!

Monster Halo Lite తో లాంచ్ అవుతున్న iQOO 13 స్మార్ట్ ఫోన్.!
HIGHLIGHTS

iQOO 13 లాంచ్ గురించి కంపెనీ కొత్త టీజర్ ఇమేజ్ ను రిలీజ్ చేసింది

ఈ ఫోన్ యొక్క డిజైన్ ను మరియు కొన్ని కీలకమైన వివరాలు కూడా ఐకూ చెప్పకనే చెబుతోంది

త్వరలోనే ఈ ఫోన్ కీలకమైన వివరాలు పూర్తిగా వెల్లడించే అవకాశం

ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ గురించి కంపెనీ కొత్త టీజర్ ఇమేజ్ ను రిలీజ్ చేసింది. iQOO 13 స్మార్ట్ ఫోన్ ను Monster Halo Lite తో లాంచ్ చేయబోతున్నట్లు ఐకూ కన్ఫర్మ్ చేసింది. ఈ ఐకూ అప్ కమింగ్ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ యొక్క డిజైన్ ను మరియు కొన్ని కీలకమైన వివరాలు కూడా ఐకూ చెప్పకనే చెబుతోంది. అయితే, త్వరలోనే ఈ ఫోన్ కీలకమైన వివరాలు పూర్తిగా వెల్లడించే అవకాశం కూడా ఉంటుంది.

iQOO 13 Monster Halo Lite

ఐకూ 13 స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి కంపెనీ కొత్త టీజర్ ను కంపెనీ అధికారిక X అకౌంట్ నుంచి షేర్ చేసింది. ఈ ట్వీట్ ద్వారా ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఐకూ 13 కొత్త మాన్స్టర్ హేలో లైట్ తో లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ కెమెరా సెటప్ చుట్టూ వుండే పెద్ద రింగ్ లైట్ నే ఈ పేరుతో పిలుస్తోంది. ఈ కొత్త లైట్ తో ఈ ఫోన్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది.

ఐకూ 13 స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ చాలా సన్నగా మరియు రౌండ్ కార్నర్స్ తో చాలా అందమైన డిజైన్ తో కనిపిస్తోంది. ఇది కాకుండా ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నట్లు కూడా సూచించింది.

వాస్తవానికి, ఐకూ 13 స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైన్ మార్కెట్ లో విడుదల చేయబడింది మరియు సేల్ కి కూడా అందుబాటులోకి కూడా వచ్చింది. ఈ ఫోన్ Snapdragon 8 Elite చిప్ సెట్, 16GB LPDDR5X ర్యామ్ మరియు 1TB ఇంటర్నల్ స్టోరేజ్ తో చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ QHD+ (3168 x 1440) రిజల్యూషన్ కలిగిన 6.82 ఇంచ్ AMOLED స్క్రీన్ ను కూడా కలిగి వుంది.

ఈ ఫోన్ లో 50MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్ మరియు 50MP టెలిఫోటో లెన్స్ కలిగిన ట్రిపుల్ కెమెరా సిస్టం మరియు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 6,150 mAh బిగ్ బ్యాటరీని 120W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Also Read: భారీ ఫీచర్స్ తో విడుదలైన Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ : ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

ఇండియాలో కూడా ఇదే ఫోన్ ను లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చు, అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, కంపెనీ నుంచి అధికైర్క అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ కూడా రూమర్స్ గానే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo