iQOO 13 5G ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ముందుగా చైనా మార్కెట్ లో విడుదల చేయబడింది మరియు ఈరోజు ఇండియాలో కూడా లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ ఫోన్ Snapdragon 8 Elite మరియు భారీ కెమెరా సెటప్ వంటి ఫీచర్స్ తో వచ్చింది. ఈ లేటెస్ట్ ఐకూ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (12GB+256GB) రూ. 54,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ (16GB+512GB) ను రూ. 84,999 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ బుకింగ్ ని ఈరోజు నుంచే ఐకూ ఓపెన్ చేసింది. ఈ ఫోన్ ఫాస్ట్ సేల్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతుంది.
ఈ ఫోన్ తో బ్యాంక్ మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్లను ఐకూ అందించింది. ఈ ఫోన్ ను ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 3,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ను వివో లేదా ఐకూ డివైజెస్ తో ఎక్స్ చేంజ్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు బోనస్ లభిస్తుంది. ఈ ఫోన్ తో లిమిటెడ్ పిరియడ్ ప్రీ బుక్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ తో రూ. 3,999 రూపాయల గేమ్ ప్యాడ్ ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది.
ఐకూ 13 స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Elite వేగవంతమైన చిప్ సెట్ మరియు Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ తో లాంచ్ అయ్యింది. దీనికి జతగా 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB (UFS 4.1) ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30 లక్షలకు పైగా AnTuTu స్కోర్ తో గొప్ప పెర్ఫార్మన్స్ అందిస్తుందని ఐకూ తెలిపింది.
ఐకూ 13 స్మార్ట్ ఫోన్ లో 2K రిజల్యూషన్ కలిగిన పెద్ద 6.8 ఇంచ్ AMOLED స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్ మరియు అధిక బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ వేగంగా చల్లబడడానికి వీలుగా పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా వుంది. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6000 mAh సిలికాన్ ఆనోడు బ్యాటరీ వుంది.
Also Read: BSNL : రూ. 400 కంటే తక్కువ ధరలో 150 రోజులు వ్యాలిడిటీ అందించే బెస్ట్ ప్లాన్.!
ఇక ఈ ఫోన్ కలిగి ఉన్న కెమెరా సిస్టం విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం వుంది. ఇందులో, 50MP Sony IMX921 మెయిన్, 50 MP అల్ట్రా వైడ్ మరియు 50MP Sony IMX 816 టెలిఫోటో సెన్సార్ వున్నాయి. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ మెయిన్ మరియు సెల్ఫీ కెమెరాతో కూడా 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ వీడియో షూట్ చేయవచ్చు.