iQOO 12 5G: కళ్ళు చెదిరే స్పెక్స్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!
అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చెయ్యడానికి ఐకూ డేట్ అనౌన్స్ చేసింది.
కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కంపెనీ ఇప్పటికే టీజింగ్ చేస్తోంది.
iQOO 12 5G స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 12న ఇండియాలో లాంచ్ అవుతుంది
చైనా మరియి ఇండియాలో తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చెయ్యడానికి ఐకూ డేట్ లను అనౌన్స్ చేసింది. ఐకూ 12 5G స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 7 న చైనాలో మరియు డిసెంబర్ 12న ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయనున్నట్లు డేట్స్ ను ప్రకటించింది. చైనా లో లాంచ్ అవనున్న వేరియంట్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కంపెనీ ఇప్పటికే టీజింగ్ చేస్తోంది. వీటిని చూస్తుంటే, ఈ స్మార్ట్ ఫోన్ కళ్ళు చెదిరే స్పెక్స్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతోందని క్లియర్ గా అర్ధమవుతోంది.
iQOO 12 5G teased specs (చైనా)
వివో యొక్క చైనా అధికారిక వెబ్సైట్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను బయట పెట్టింది. ఈ వివరాల ప్రకారం, ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 1.5K రిజల్యూషన్ కలిగిన E7 డిస్ప్లేతో వస్తున్నట్లు కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ Snapdragon 8 Gen 3 ప్రోసెసర్ తో లాంచ్ అవుతున్న మొదటి ఫోన్. ఇదికాక, ఈ ఫోన్ లో 16GB LPDDR5X ఫాస్ట్ RAM మరియు 1TB (UFS 4.0) అతి భారీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటాయి.
Also Read : Amazon Sale నుండి దీపావళి ధమాకా.. Lava Agni 2 5G పైన భారీ డిస్కౌంట్.!
ఇక ఈ ఫోన్ కెమేరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ కెమేరా సెటప్ పరంగా, వెనుక 50MP + 50MP + 64MP కెమేరా ఉంటుంది. ఈ ఫోన్ కెమేరా 100x జూమ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో భారీ 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీ, గొప్ప ఫోటోలు మరియు వీడీయోల కోసం ఐకూ సొంతగా డెవలప్ చేసిన Q1 చిప్ సెట్ వంటి ఫీచర్స్ తో ఈ ఫోన్ వస్తోంది.
ఇక ఇండియా లాంచ్ విషయానికి వస్తే, ఇదే ఫోన్ ఇండియా లాంచ్ గురించి కూడా ఐకూ టీజింగ్ మొదలు పెట్టింది. అయితే, ఈ స్మార్ట్ డిసెంబర్ 12 వ తేదీ ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అవుతుంది.