100X జూమ్ కెమేరాతో రేపు సాయంత్రం లాంచ్ కాబోతున్న iQOO 12 5G
iQOO 12 5G లాంచ్ డేట్ వచ్చేసింది
ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ ను రేపు సాయంత్రం 5 గంటలకు లాంచ్ చేయబోతోంది
ఈ స్మార్ట్ ఫోన్ 100X జూమ్ కెమేరాతో వస్తోంది
గత నెల ఈరోజుల నుండి ఐకూ కంపెనీ టీజింగ్ చేస్తున్న iQOO 12 5G లాంచ్ డేట్ వచ్చేసింది. ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ ను రేపు సాయంత్రం 5 గంటలకు లాంచ్ చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ 100X జూమ్ కెమేరా మరియు స్నాప్ డ్రాగన్ పవర్ ఫుల్ ప్రోసెసర్ తో ఇండియన్ మార్కెట్ లో విడుదల అవుతోంది. రేపు విడుదల కాబోతున్న ఈ కొత్త ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
iQOO 12 5G Launch
ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను గత నెలలోనే చైనీస్ మార్కెట్ లో లాంచ్ చేసింది ఐకూ. అయితే, ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో కూడా విడుదల చెయ్యడానికి సిద్దమయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ అందించిన కీలకమైన స్పెక్స్ ద్వారా ఈ ఫోన్ ఎలా ఉండబోతోందనే ఒక అంచనా మనకు వస్తుంది. మరి స్పెక్స్ ఏమిటి మరియు ఈ ఫోన్ ఎలా ఉండబోతోందో తెలుసుకుందామా.
100X Zoom camera
ఐకూ తీసుకు వస్తున్న ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ 100X Zoom కలిగిన భారీ కెమేరా సెటప్ ను కలిగి వుంది. ఇందులో, వెనుక 50MP మెయిన్ + 50MP అల్ట్రా వైడ్ + 64MP పెరిస్కోప్ టెలీఫోటో సెన్సార్ తో ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది. ఈ కెమేరా సెటప్ అద్భుతమైన ఫోటోలతో పాటుగా హై రిజల్యూషన్ వీడియోలను చిత్రీకరించవచ్చని ఐకూ చెబుతోంది.
Also Read : Realme C67 5G: ఫాస్ట్ ఛార్జింగ్ మరియు స్లీక్ డిజైన్ తో వస్తోంది.!
Display
ఈ ఫోన్ లో అందించిన డిస్ప్లే గురించి కూడా లాంఛ్ కంటే ముందే వివరాలను అందించింది. ఈ ఫోన్ ను 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లేతో తీసుకు వస్తోంది. ఈ డిస్ప్లే 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు వెట్ టచ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది.
Processor
ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 ప్రోసెసర్ తో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అవుతున్న మొదటి ఫోన్ గా గుర్తింపు అందుకుంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో హెవీ LPDDR5X RAM మరియు UFS 4.0 స్టోరేజ్ కూడా ఉన్నాయి. అధనంగా, ఈ ఫోన్ లో ఐకూ యొక్క ప్రత్యేకమైన Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్ ను కూడా కలిగి వుంది.
Batetry & charging
ఐకూ 12 5G స్మార్ట్ ఫోన్ లో 5000mAh హెవీ బ్యాటరీని అత్యంత వేగవంతమైన 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.