భారీగా తగ్గిన iQOO 12 5G స్మార్ట్ ఫోన్ ధర.. కొత్త ప్రైస్ ఎంతంటే.!

Updated on 25-Mar-2025
HIGHLIGHTS

iQOO 12 5G స్మార్ట్ ఫోన్ ధర ఇప్పుడు భారీగా తగ్గింది

ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ నుంచి ఎన్నడూ చూడనంత తక్కువ ధరకు సేల్ అవుతోంది

ఎటువంటి బ్యాంక్ ఆఫర్ తో అవసరం లేకుండా నేరుగా ఆఫర్ ధరకే లభిస్తుంది

iQOO 12 5G స్మార్ట్ ఫోన్ ధర ఇప్పుడు భారీగా తగ్గింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ నుంచి ఎన్నడూ చూడనంత తక్కువ ధరకు సేల్ అవుతోంది. ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో వచ్చిన ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి చాలా తక్కువ ధరకు లభిస్తోంది. అదికూడా ఈ ఫోన్ పై ఎటువంటి బ్యాంక్ ఆఫర్ తో అవసరం లేకుండా నేరుగా ఆఫర్ ధరకే లభిస్తుంది.

iQOO 12 5G : ఆఫర్ ధర

ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 52,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ నుంచి రూ. 41,999 ధరకే లభిస్తోంది. అంటే, ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ నుంచి రూ. 11,000 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1892 రూపాయల వడ్డీ సేవ్ చేసే No Cost EMI మరియు అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా రూ. 2,099 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. అఫర్ చెక్ చేయడానికి Click Here

iQOO 12 5G : ఫీచర్స్

ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 2.1Mn కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందించే 4nm TSMC చిప్ సెట్. దీనికి జతగా 12GB LPDRR5X ర్యామ్ మరియు 256GB (UFS 4.0) ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈఫోన్ 6.78 ఇంచ్ LTPO AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది.

iQOO 12 5GiQOO 12 5G

ఈ ఫోన్ 50MP మెయిన్ + 50MP అల్ట్రా వైడ్ + 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కలిగి పవర్ ఫుల్ ట్రిపుల్ రియర్ కెమెరా తో వస్తుంది. ఈ ఫోన్ 4K వీడియో లను 60FPS తో షూట్ చేసే శక్తి కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ప్రత్యేకమైన సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1 కూడా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు 4D Game వైబ్రేషన్ కూడా ఉంటుంది.

Also Read: భారీ ఆఫర్స్ తో మొదలైన Realme P3 Ultra 5G స్మార్ట్ ఫోన్ సేల్.!

ఇక ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ 4 జెనరేషన్ మేజర్ OS అప్డేట్స్ మరియు 5 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ ను కూడా అందుకుంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :