iQOO 12 5G: స్టన్నింగ్ కెమేరా మరియు సూపర్ కంప్యూటింగ్ చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది.!
iQOO 12 5G డిసెంబర్ 12 వ తేదీ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అవుతోంది
ఈ అప్ కమింగ్ ఫోన్ ఫీచర్స్ ను ఒక్కొక్కటిగా టీజర్ ద్వారా కంపెనీ విడుదల చేస్తోంది
ఈ ఫోన్ కోసం అమేజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది
iQOO 12 5G స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 12 వ తేదీ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ ను ఒక్కొక్కటిగా టీజర్ ద్వారా కంపెనీ విడుదల చేస్తోంది. ముందుగా చైనీస్ మార్కెట్ లో విడుదల చేయబడిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారత మార్కెట్ లో కూడా లాంచ్ చేస్తోంది ఐకూ. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ టీజ్డ్ స్పెక్స్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.
iQOO 12 5G Teased Specs
ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ ను కంపెనీ ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. ఈ ఫోన్ యొక్క కెమేరా, ప్రోసెసర్, ర్యాం, స్టోరేజ్ మరియు మరిన్ని కొన్ని ఇతర స్పెక్స్ ను ఇప్పటికే కంపెనీ బయట పెట్టింది. ఈ ఫోన్ కోసం అమేజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అంటే, అమేజాన్ ద్వారా ఈ ఫోన్ సేల్ అవుతుంది.
ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ ను గొప్ప స్పీడ్ అందించ గల క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 ప్రోసెసర్ తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ లో వేగవంతమైన LPDDR5X RAM మరియు UFS 4.0 ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ అత్యధికంగా 2.1 మిలియన్ పైనే AnTuTu స్కోర్ ను అందిస్తుందని చెబుతోంది.
Also Read : బడ్జెట్ ధరలో లగ్జరీ Smart Watch ను లాంచ్ చేసిన ఫైర్ బోల్ట్.!
ఈ ఫోన్ లో వెనుక 50MP + 50MP + 64MP ఫ్లాగ్ షిప్ కెమేరాని కలిగి వుంది. ఈ కెమేరా సిస్టమ్ తో ఇండియాలో విడుదలయ్యే మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుందని కూడా ఐకూ గొప్పగా చెబుతోంది. ఇందులో, 50MP ఆస్ట్రో గ్రఫీ కెమేరా, 50MP అల్ట్రా వైడ్ కెమేరా మరియు 64MP పెరిస్కోప్ టెలిఫోటో (3X) కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ ను మరింత వేగవంతంగా మార్చడానికి ఐకూ సొంత సూపర్ కంప్యూటింగ్ చిప్ సెట్ Q1 ను కూడా జత చేసింది.
ఈ ఫోన్ 144 fps గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ మరియు ఫోన్ ను వేగంగా చల్ల బర్చడానికి వీలుగా 6K లార్జ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం ను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ ను గురించి కంపెనీ ఇప్పటి వరకూ ఈ ఫీచర్స్ తో టేకింగ్ చేస్తోంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ కూడా త్వరలో వెల్లడించవచ్చు.