ఇండియాలో కొత్త ఫోన్స్ లాంచ్ కోసం ఐకూ కంపెనీ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. అదే, iQOO 12 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను డిసెంబర్ 12 వ తేదీ ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు డేట్ ప్రకటించింది. ఇన్ని రోజులు ముందే ఈ ఫోన్ లాంచ్ కోసం డేట్స్ ఇంత ముందు ఎందుకు ప్రకటించింది అనుకుంటున్నారా? ఈ ఫోన్ స్పెక్స్ అలా వున్నాయి మరి. ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు లాంచ్ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.
ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఐకూ 12 5G స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ ను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి Tweet చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు అందించిన టీజింగ్ క్యాప్షన్ లో Ending 2023 with a BANG! అని పోస్ట్ చేసింది. అంతేకాదు, #dothedream హ్యస్ ట్యాగ్ ను దీనికి తగిలించింది.
వాస్తవానికి, ఐకూ 12 5G ముందుగా చైనాలో లాంచ్ కాబోతోంది మరియు ఇది నవంబర్ 7న చానలో లాంచ్ అవుతుంది. అంటే, ఈ ఫోన్ చైనాలో విడుదలైన నెల రోజుల తరువాత ఇండియాలో విడుదల అవుతుంది.
Also Read : Flipkart Big Diwali sale: భారీ డిస్కౌంట్ తో 30 వేలకే 55 ఇంచ్ QLED Smart Tv.!
ఐకూ 12 5జి చైనా వేరియంట్ గురించి ఇప్పటికే చాలా స్పెక్స్ బయటకి వచ్చాయి మరియు ఈరోజు కూడా కొన్ని కొత్త స్పెక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫోన్ ను అత్యంత వేగవంతమైన Snapdragon 8 Gen 3 ప్రోసెసర్ శక్తితో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా నెట్టింట్లో వచ్చిన కొత్త అప్డేట్ ల ప్రకారం, ఈ ఫోన్ లో 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన E7 AMOLED డిస్ప్లే ఉంటుంది.
అంతేకాదు, ఈ ఫోన్ లో 100X జూమ్ సపోర్ట్ కలిగిన భారీ ట్రిపుల్ కెమేరా సెటప్ ను కూడా మనం చూడవచ్చు. ఇక ఈ ఫోన్ డిజైన్ చూస్తుంటే మతిపోతోంది. చాలా క్లియర్ మరియు ప్రీమియం లుక్స్ ఈ ఫోన్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, IP 68 రేటింగ్, 16GB LPDDR5X RAM, 1TB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ మరియు Hi-Res ఆడియో వంటి ఫీచర్స్ గురించి చైనా vivo వెబ్సైట్ నుండి టీజింగ్ చేస్తోంది.
ఈ స్పెక్స్ మరియు డిజైన్ లు చూస్తుంటే ఈ ఫోన్ మార్కెట్ లో కొత్త ఒరవడిని మరియు ట్రెండ్ ను సెట్ చేసేలా కనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ చేతుల్లోకి వచ్చిన తరువాత మాత్రమే ఇది యెంత వరకూ నిజమో మనం చెప్పవచ్చు. అప్పటి వరకూ మనం అంచనాలు మాత్రమే అందించవచ్చు.